spot_img
Homeలైఫ్ స్టైల్Male Fertility Heat Exposure Risks: ఎండలో బండిపై ఎక్కువగా తిరుగుతున్నారా.. జాగ్రత్త.. ఈ...

Male Fertility Heat Exposure Risks: ఎండలో బండిపై ఎక్కువగా తిరుగుతున్నారా.. జాగ్రత్త.. ఈ సమస్యలు రావొచ్చు..

Male Fertility Heat Exposure Risks: నేటి ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ఇప్పటి పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలు చాలా వరకు చూస్తుననారు. వీరిలో స్పెర్మ్ సామర్థ్యం తగ్గడం ఒక సాధారణ సమస్యగా మారుతోంది. దీని వెనుక అనేక కారణాలు ఉన్నప్పటికీ, వైద్య నిపుణులు ప్రత్యేకంగా సూచించే అంశం శరీరంలో వేడి ఎక్కువగా ఉండడమే అని అంటున్నారు. అయితే ఈ వేడి మనం రోజూ ఉండే అలవాటల్లోనే ఎక్కువవుతుందని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. ఆ అలవాట్లు ఏంటంటే?

పురుషుల్లో ఉండే వృషణాల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వీర్యకణాల ఉత్పత్తి ప్రక్రియ దెబ్బతింటుంది. దీని వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడం.. కదలిక మందగించడం , ఆకృతి లోపాలు వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో ఇది పురుషుల్లో వంధ్యత్వానికి దారితీయవచ్చు. ముఖ్యంగా నిరంతరం వేడి ప్రభావంలో ఉండే వారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతున్నారు.

అయితే మనకు తెలియకుండానే కొన్ని రోజువారీ అలవాట్లు వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల నేరుగా వేడి ప్రభావం పడుతుంది. టైట్ జీన్స్ లేదా గట్టిగా ఉండే లోదుస్తులు ధరించడం వల్ల గాలి ఆడక ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే కార్లలో హీటెడ్ సీట్లు, ఎక్కువసేపు కూర్చోవడం, బైక్‌పై దీర్ఘకాల ప్రయాణం కూడా ఈ సమస్యను మరింత పెంచుతాయి. వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయడం, సౌనా లేదా స్టీమ్ బాత్‌లను తరచుగా ఉపయోగించడం కూడా వృషణాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అలాగే ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోవడం వల్ల రక్తప్రసరణ తగ్గి ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది. ఈ అలవాట్లు క్రమంగా వీర్యకణాల నాణ్యతను దెబ్బతీస్తాయి.

ఫెర్టిలిటీని కాపాడుకోవాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ టేబుల్‌పై పెట్టుకుని ఉపయోగించడం మంచిది. కాటన్ లోదుస్తులు ధరించడం ద్వారా గాలి ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. టైట్ జీన్స్‌కు బదులుగా లూజ్‌గా ఉండే దుస్తులు ధరించాలి. బైక్ సీటు వేడి తగ్గిన తర్వాతే కూర్చోవడం మంచిది. అలాగే ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నడవడం కూడా ఉపయోగకరం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bandla Ganesh

Bandla Ganesh: నిర్మాత బండ్ల గణేష్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇక అయిపోయినట్టే..

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి సుప్రీం కోర్టు నుండి చాలా పెద్ద ఎదురుదెబ్బ నే తగిలింది. తనకు ఉన్నటువంటి స్థిరాస్తిని యూనియన్ బ్యాంకు వేలం వేయడాన్ని సమర్థిస్తూ...
India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Oktelugu Epaper