Skin Care Tips: మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఇవి ఫాలో అవ్వండి

Skin Care Tips: ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా జస్ట్ పాలతో కొన్ని సింపుల్ టిప్స్ యూజ్ చేయండి. దీనికోసం పాలలో ముంచిన మెత్తని కాటన్ ప్యాడ్ తీసుకోవాలి.

Written By: Swathi, Updated On : May 27, 2024 3:51 pm

Skin Care Tips

Follow us on

Skin Care Tips: వేసవి, చలికాలం వచ్చిందంటే చాలు స్కిన్ డిఫరెంట్ గా అవుతుంటుంది. పగుళ్లు కూడా ఏర్పడతాయి. కొందరిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. అటువంటి చర్మంపై మీరు ఎంత మాయిశ్చరైజర్‌ను అప్లై చేసినా ఫలితం మాత్రం శూన్యమే ఉంటుంది. మీరు శతకోటి ప్రయత్నాలు చేసినా సరే సమస్య పెరుగుతుంది కానీ తగ్గదు. ఇక ఖరీదైన క్రీములు వాడినా డబ్బులు వృదా అవుతుంటాయి. అటువంటి పరిస్థితిలో చర్మాన్ని రక్షించుకోవడం ఎలా ఎలా అటూ వివిధ రకాల ఆలోచిస్తుంటారు కానీ పచ్చి పాల గురించి ఆలోచించారా?

ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా జస్ట్ పాలతో కొన్ని సింపుల్ టిప్స్ యూజ్ చేయండి. దీనికోసం పాలలో ముంచిన మెత్తని కాటన్ ప్యాడ్ తీసుకోవాలి. పచ్చి పాలను క్లెన్సర్‌గా మార్చుకోవడానికి దానికి కొంచెం కాఫీ పౌడర్, సముద్రపు ఉప్పును కలపండి. ఈ పేస్ట్‌ను రెండు చేతులకు రాసుకొని మొహం మీద వృత్తాకారంలో కాసేపు స్మూత్‌గా మర్ధన చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఒత్తడి పెట్టకుండా, తేలికగా రబ్ చేసుకోండి. కాసేపటి తర్వాత గోరు వెచ్చని నీటితో మొహాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం మీకే అర్థం అవుతుంది.

గ్లిజరిన్, నిమ్మకాయ మిశ్రమాన్ని తయారు చేసి ఒక సీసాలో భద్రపరుచుకోండి. దీన్ని రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి, శరీరానికి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నూనె చాలా పని చేస్తుంది. వాస్తవానికి, కొబ్బరి నూనె(Coconut Oil) ఆరోగ్యకరమైన కొవ్వు, తేమ లక్షణాలతో మిళితం అయి ఉంటుంది.అంతేకాదు ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ కూడా ఈ కొబ్బరి నూనె. ఇది చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుూ.. పొడి చర్మం సమస్యను తగ్గించడంలో సహాయం చేస్తుంది.

అలోవెరా క్రీమ్ లేదా జెల్ ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలోవెరా(Aloveera) ఉత్తమ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. లోషన్‌కు బదులుగా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉపయోగించినా ఫలితం ఉంటుంది. ఎండలోకి వెళ్లే ముందు అధిక SPF 40 ఉన్న సన్‌స్క్రీన్‌ని అప్లై చేసుకొని వెళ్లండి. మేకప్ సమయంలో చర్మాన్ని ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్‌గా ఉంచుకోవడం మర్చిపోవద్దు.

Cracked Heels: మడమలు పగులుతున్నాయా? ఇదిగో నివారణ మార్గాలు

Super Food: అన్నీ మర్చిపోతున్నారా? అయితే ఇదిగో సూపర్ ఫుడ్స్