Super Food: అన్నీ మర్చిపోతున్నారా? అయితే ఇదిగో సూపర్ ఫుడ్స్

ఇందులోనే కదా పెట్టాను అంటూ అమ్మ అబ్బో ఇలా చాలా మర్చిపోతుంటారు ప్రతి ఒక్కరు. మరి మీకు కూడా ఇలాంటి మతిమరుపు వస్తుందా? బ్రెయిన్ షార్ప్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా?

Written By: Swathi Chilukuri, Updated On : May 27, 2024 2:32 pm

Forgetting everything

Follow us on

Super Food: అబ్బ మొన్ననే చదివాను ఈ ఆన్సర్. సరిగ్గా సమయానికి గుర్తు రావడం లేదు. స్టార్టింగ్ ఒక లైన్ గుర్తు వస్తే చాలు ఆన్సర్ మొత్తం రాసేస్తాను అని విద్యార్థులు. షట్ ఏదో పేరుతో ఫోల్డర్ క్రియేట్ చేశాను. పలానా ఫోల్డర్ లో ఏదో సేవ్ చేశాను గుర్తు రావడం లేదు అని ఆఫీసుల్లో.. ఒరెయ్ డబ్బులు పెట్టాను ఇక్కడ మీరు ఏం అయినా చూశారా? పోపు డబ్బాలోనే డబ్బులు ఎక్కడికి పోతాయి. ఇందులోనే కదా పెట్టాను అంటూ అమ్మ అబ్బో ఇలా చాలా మర్చిపోతుంటారు ప్రతి ఒక్కరు. మరి మీకు కూడా ఇలాంటి మతిమరుపు వస్తుందా? బ్రెయిన్ షార్ప్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నారా? అయితే ఓ లుక్ వేయండి..

పచ్చని ఆకుకూరలు(Leafy Vegetables) తినడం వల్ల మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. క్యాబేజీ, పాలకూర, కాలీఫ్లవర్ వంటి ఆకుకూరలు మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాఫీ కూడా ఈ విషయంలో చాలా హెల్ప్ చేస్తుందట. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు జ్ఞాపక శక్తిని(Memory) పెంచడంలో సహాయం చేస్తాయి. పాల ఉత్పత్తులు తినడం వల్ల కూడా బ్రెయిన్ చురుగ్గా పని చేస్తుందట. అందుకే ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులను చేర్చుకోవాలి.

రెగ్యూలర్ డైట్ లో చియా సీడ్స్(Chia seeds) ను చేర్చుకోవడం కూడా చాలా మంచిది. మెదడు ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఇందులో ఉంటాయి. డార్క్ చాక్లెట్స్ కూడా ఈ విషయంలో చాలా బెటర్ గా పనిచేస్తాయట. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలోనూ, మెదడు పనితీరును వేగవంతం చేయడంలోనూ సహాయం చేస్తాయి. మరో బెస్ట్ ఫుడ్ గురించి చెప్పాలంటే బ్రోకలీ. ఇది కూడా మెదడు ఆహారాన్ని పెంచుతుంది.

రోజు దానిమ్మ పండు తినడం వల్ల రక్తం మెరుగు పడుతుంది. అంతేకాదు వీటి వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగు అవుతుంది. ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తింటే మీ ఆరోగ్యంతో పాటు మెదడు ఆరోగ్యం కూడా బెటర్ అవుతుందట. కొత్తగా మీ డైట్ లో వేటిని చేర్చుకోవాలి అనుకున్నా సరే వైద్యుల సలహా ముఖ్యం అని గుర్తు పెట్టుకోండి.

Drinking Water: తగినంత నీరు తాగడం లేదా? ఓ సారి ఇది చదవండి..

Potato: ఆలుగడ్డ తింటున్నారా? ప్రయోజనాలు తెలిస్తే లాగించేస్తారు