Gautam Gambhir: ఐపీఎల్ 17వ(IPL 17) సీజన్లో విజేతగా నిలవడంతో..కోల్ కతా జట్టు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం..కోల్ కతా ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. కోల్ కతా జట్టు లోగడ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో 2012, 2014 సీజన్లలో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు శ్రేయస్ అయ్యర్ తెరదించాడు. తన ఆధ్వర్యంలో కోల్ కతా జట్టుకు ట్రోఫీ ని అందించాడు.. గతంలో కోల్ కతా జట్టుకు కెప్టెన్ గా ఉన్న గౌతమ్ గంభీర్.. ప్రస్తుతం మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో అతడు లక్నో జట్టుకు మెంటార్ గా ఉన్నాడు. అతని ఆధ్వర్యంలో లక్నో జట్టు రెండుసార్లు ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ సంవత్సరం.. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి, గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టుకు(Kolkata Knight Riders) మెంటార్ గా వచ్చాడు. గాడి తప్పిన జట్టును ఏకతాటిపై నిలిపాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో తిరుగులేని విధంగా మార్చాడు.
గంభీర్ మెంటార్ గా వచ్చిన తర్వాత కోల్ కతా జట్టు కథ పూర్తిగా మారిపోయింది. లీగ్ దశలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.. క్వాలిఫైయర్ -1 మ్యాచ్లో హైదరాబాద్ జట్టు(Sunrisers Hyderabad) పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే ధోరణి కొనసాగించింది. కోల్ కతా ఈ ఘనత అందుకోవడానికి కారణం గౌతం గంభీర్ అని, ఆ జట్టు ఆటగాళ్లు కితాబిస్తున్నారు.. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్ ట్విట్టర్ ఎక్స్ లో ఒక పోస్ట్ చేశాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది..” సత్యం, ధర్మంపై ఎవరి ఆలోచనలు ఆధారపడి ఉంటాయో.. వాటి ఆధారంగా ఆ చర్యలు కొనసాగుతాయో.. ఇప్పటికీ వారికి శ్రీకృష్ణుడే రథసారథి.. ఆయనే వారికి మార్గదర్శి అని” తాత్వికంతో గౌతమ్ గంభీర్ పోస్ట్ చేశారు. అయితే దీనిని ఇంగ్లీషులో కాకుండా హిందీలో రాసుకొచ్చారు. అయితే దీని వెనుక అర్థం ఏమిటి అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే కోల్ కతా జట్టు ప్రారంభించి ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకుంది కాబట్టే.. గెలిచిందని.. అదే గౌతమ్ గంభీర్ చేసిన పోస్ట్ ఉద్దేశమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు గౌతమ్ గంభీర్ మెంటార్ గా వచ్చిన తర్వాత ఆటగాళ్లు కూడా తమ స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఐపీఎల్ విజేతగా ఆవిర్భవించిన తర్వాత తమ అనుభవాలను పంచుకున్నారు..” గౌతమ్ గంభీర్ మెంటార్ గా నియమితులైన తర్వాత సంతోషం వ్యక్తం. ఆయనకు భారీ సందేశాన్ని పంపాను. దానికి అతడు ధన్యవాదాలు తెలిపారు. చేతిలో ట్రోఫీతో పోడియం పై నిలబడితే మరింత సంతోషిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చిందని” కోల్ కతా ఆటగాడు రాణా అన్నాడు. ఆరో ఆటగాడు రింకు సింగ్ సైతం గౌతమ్ గంభీర్ పాత్ర పట్ల హర్షం వ్యక్తం చేశాడు. ఏడు సంవత్సరాల కలను నెరవేర్చాడని కొనియాడాడు. టీం తరఫున గౌతమ్ గంభీర్ కు కృతజ్ఞతలు తెలియజేసాడు. మరో విధ్వంసకర ఆటగాడు సునీల్ నరైన్ కూడా గౌతమ్ గంభీర్ కు కృతజ్ఞతలు తెలియజేసాడు.
Shreyas Iyer : రోహిత్ చేయలేనిది.. శ్రేయస్ అయ్యర్ చేతుల్లో చూపించాడు.. భవిష్యత్తు కెప్టెన్ అతడే..
Shreyas Iyer : పనికిరాడని పక్కన పెట్టారు.. ఇప్పుడు చూశారా ఏం చేశాడో?