ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ కాలుష్యంతో పాటు తీసుకునే ఆహారం అన్నీ కల్తీమయం కావడంతో శరీరంలో కొన్ని మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులు ఒక్కోసారి క్యాన్సర్ కు కూడా దారి తీయొచ్చని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా శరీరంలో ఏర్పడే కొన్ని మార్పులను గమనించి ముందుగానే చికిత్స తీసుకుంటే క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు అని అంటున్నారు. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
Also Read: వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త మూవీ లో సెకండ్ హీరో గా కళ్యాణ్ రామ్..వీడియో వైరల్!
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిపుణులు తెలుపుతున్న ప్రకారం.. క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే శరీరంలో అకస్మాత్తుగా కొన్ని మార్పులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని.. ఈ మార్పులు క్యాన్సర్ అని తెలిస్తే వెంటనే చికిత్స తీసుకొని క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. శరీరం ఒకేసారి బరువు తగ్గడం వంటివి ఒక్కోసారి చూస్తుంటాం. ఎలాంటి వ్యాయామం చేయకపోయినా.. డైట్ పాటించకపోయినా ఒక్కోసారి శరీరం బరువు కోల్పోతుంది. కొన్ని నెలల్లోనే నాలుగు నుంచి ఐదు కిలోల వరకు బరువు తగ్గితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకపోయినా వారాల తరబడి జ్వరం వస్తే.. విశ్రాంతి తీసుకున్న కూడా బలహీనతగా అనిపిస్తే.. చర్మం అకస్మాత్తుగా మారడం.. చర్మంపై నల్లటి రంగు మార్పులు, గడ్డలు వంటివి కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. అలాగే మూడు నుంచి నాలుగు వారాలు అయినా మానని గాయాలు, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు భావన వంటి లక్షణాలు క్యాన్సర్ సంకేతాలు అని అంటున్నారు.
ఏ వ్యాధి అయినా మనం ఉండే వాతావరణం, తీసుకునే ఆహార పదార్థాలతోనే వస్తుంది. క్యాన్సర్ రావడానికి ఎక్కువగా ధూమపానం, మద్యపానం అలవాటు ఉండడం.. కుటుంబంలో ఇదివరకే ఒకరికి క్యాన్సర్ చరిత్ర ఉండడం.. స్థూల కాయం, వ్యాయామం లేకపోవడం.. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం.. అధిక మాంసాహారం తీసుకోవడం వంటివి క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇలాంటి వాతావరణం లేదా పరిస్థితులు ఉన్నవారు ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది. అంతేకాకుండా వీరిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలో గుర్తించిన క్యాన్సర్ లో చాలా వరకు పూర్తిగా నయం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గర్భాశయ ద్వారా క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంటే స్క్రీనింగ్ ద్వారా నివారణ చేయవచ్చు. చర్మ క్యాన్సర్ ను ప్రారంభ దశలో తొలగించవచ్చు.
అయితే క్యాన్సర్ బారిన పడకుండా ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు, ధూమపానం మానడం, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించడం, వ్యాయామం ఎక్కువగా చేయడం, అవసరమైన టీకాలు వేయించుకోవడం వంటివి చేయడం వల్ల క్యాన్సర్ భారి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.