Cracked Heels: ఇల్లుకు పునాది ఎలానో.. శరీరానికి పునాది పాదాలు. మొత్తం శరీరం బరువు పాదాలపైనే పడుతుంది. మన శరీరాన్ని కదిలించేది పాదాలు. అందుకే పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. ఇదిలా ఉంటే పొడి వాతావరణం ఉంటే మడమల పగుళ్ల చాలా ఎక్కువ అవుతాయి. ఈ సమస్య మహిళల్లో(Women) మరీ ఎక్కువ ఉంటుంది. తేమ లేకపోవడం, విటమిన్ లోపం, మధుమేహం, థైరాయిడ్, ఊబకాయం, 60 ఏళ్లు పైబడటం వంటి సమస్యలు ఉన్నా కూడా మడమలు పగులుతుంటాయి అంటున్నారు నిపుణులు. మరి ఈ మడమల పగుళ్లకు కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకుందామా?
పాదాల పట్ల అజాగ్రత్తగా అసలు ఉండకూడదు. ఎక్కువగా చెప్పులు, ఓపెన్ షూలు వేసుకోకూడదు. కొన్ని సార్లు వీటి కారణంగా భరించలేని నొప్పిని ఎదుర్కోవలసి ఉంటుంది. చర్మ పొడిబారితే మడమల పగుళ్లు వస్తుంటాయి.శరీరంలో తేమ లేకపోవడం వల్ల, సజీవ కణాలు గట్టిపడతాయిఅంటారు నిపుణులు. అయితే మడమల ప్రాంతంలో చనిపోయిన కణాలు పెరుగినా కూడా పాదాలు పగులుతుంటాయి. అయితే మీరు కొన్ని నేచురల్ రెమెడీస్‌తో(Natural Remedies) ఈ పగిలిన మడమలకు నివారణ మార్గాలను కనుగొనవచ్చు.
వారానికి ఒకసారి మీ పాదాలకు ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోవాలి. గోరువెచ్చని నీటిలో పాదాలను ముంచడం వల్ల మడమల చర్మం మృదువుగా తయారు అవుతుంది. మృతకణాలను తొలగించడంలో తోడ్పడుతాయి. ప్రతిరోజూ మీ పాదాలు, మడమల సరైన సంరక్షణ కోసం ప్రతిరోజూ స్నానానికి ముందు మీ పాదాలను బాదం నూనెతో మసాజ్ చేసుకోవడం బెటర్.
స్నానం చేసిన తర్వాత, పాదాలు తడిగా ఉన్నప్పుడే క్రీమ్ అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల పాదాలపై తేమను నిలుపుదల చేస్తుంది. ఫుట్ క్రీమ్‌తో మీ పాదాలను సర్క్యులర్ మోషన్‌లో తేలికగా మసాజ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. పాదాలను మృదువుగా ఉంచుతుంది. మడమల పగుళ్ల సమస్య నుంచి కూడా నివారణ పొందవచ్చు.
Drinking Water: తగినంత నీరు తాగడం లేదా? ఓ సారి ఇది చదవండి..
Health: ఉదయం వీటిని తీసుకుంటే మీ చేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్టే..