Homeహెల్త్‌Rainy Season: వర్షాకాలంలో ఆ నాలుగు కూరగాయలు తినకూడదా?

Rainy Season: వర్షాకాలంలో ఆ నాలుగు కూరగాయలు తినకూడదా?

Rainy Season: మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి సహాయకారిగా ఉంటుంది. అందుకే మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రోజు మనం తినే ఆహారం ఎలా ఉండాలనేదానిపై ఓ అవగాహన ఉండాలి. ఏ కాలంలో ఏవి తీసుకోవాలో స్పష్టమైన అవగాహన పెంచుకుని తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు. అంతేకాని ఎలాంటి పద్ధతులు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఆహారం తీసుకుంటే కలిగే నష్టాలపై అప్రమత్తంగా ఉండాల్సిందే. దీంతో ఆహారం తీసుకోవడంలో మనం ఎంతో జాగ్రత్త వహించాల్సిందే.

వర్షాకాలంలో మనం ఇంకా కొంచెం అప్రమత్తతతో ఉంటే మంచిదే. మనం వేసవి కాలంలో ఆకుకూరలు పుష్కలంగా తీసుకుంటాం. వాటితో మనకు కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే. అందుకే వాటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటాం. కానీ వర్షాకాలంలో ఆకుకూరలు తీసుకుంటే నష్టమే ఎక్కువ. ఒకవేళ తీసుకోవాలని అనుకున్నా ఆకుకూరలను దాదాపు అర గంటకు పైగా ఉడిచించి తీసుకుంటే మనకు ఎలాంటి నష్టం ఉండదని తెలుసుకుంటే మంచిది.

Rainy Season
Leafy Vegetablaes

కూరగాయల్లో వంకాయకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో తెలిసిందే. ఆహా ఏమి రుచి అనరా మైమరచి అంటూ వంకాయను తింటుంటారు. అల్లుడిని మంచిన చుట్టం లేదు. వంకాయను మించిన కూర లేదు అనేది నానుడి. అంతటి విలువ ఇచ్చే వంకాయను మాత్రం ఈ కాలంలో తీసుకోకపోవడమే శ్రేయస్కరం. ఎందుకంటే వంకాయలో వానకాలంలో వంకాయ తనను తాను రక్షించుకునేందుకు అనేక రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. దీంతో దురద, దద్దుర్లు, వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. అందుకే వంకాయను దూరం ఉంచితేనే ప్రయోజనం కలుగుతుందని గుర్తించాలి.

Rainy Season
Brinjal

ఇంకో రకం కాయ క్యాప్సికం. దీన్ని కూడా వేసవి కాలంలో ఎక్కువగా తీసుకుంటాం. కానీ వర్షాకాలంలో దీని జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇందులో గ్లూకోసినోలేట్స్ రసాయనాలు విడుదల కావడంతో నమిలినప్పుడు విషతుల్యంగా మారుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు, అజీర్తి, శ్వాస సమస్యలు ఏర్పడతాయి. అందుకే వర్షాకాలంలో క్యాప్సికం జోలికి వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వాడకం ఈ కాలంలో చేయకపోవడమే ఆరోగ్యానికి మేలు.

Rainy Season
Capsicum

మనం ఇష్టంగా తినే మరో కూరగాయ ఖాళీఫ్లవర్. ఇది కూడా తీసుకుంటే అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. అందుకే దీన్ని కూడా దూరం పెడితేనే ప్రయోజనం. వర్షాకాలంలో బెండకాయ, దోసకాయ, సొరకాయ, బీన్స్ వంటి కూరగాయలు పుష్కలంగా తినొచ్చు. కాబట్టి ఆ నాలుగు కూరగాయలను ముట్టుకోకుండా మిగతావి తీసుకుని మన దేహాన్ని బలంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం కోసం అన్ని రకాల కూరగాయలు తీసుకోవాలి. కానీ కాలానుగుణంగా చూసుకుని మనకు రక్షణ ఇచ్చే వాటిని తీసుకుంటే ప్రయోజనం కలుగుతుందని తెలుసుకోవాలి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper