Homeలైఫ్ స్టైల్Period Delay Tablets: పీరియడ్స్ వాయిదా కోసం టాబ్లెట్లు వాడుతున్నారా..?

Period Delay Tablets: పీరియడ్స్ వాయిదా కోసం టాబ్లెట్లు వాడుతున్నారా..?

Period Delay Tablets: శ్రావణమాసం ప్రారంభంతో శుభకార్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో పెళ్లిళ్లు లేదా ప్రయాణాలు ఉండటం వల్ల కొంతమంది మహిళలు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే రుతుక్రమాన్ని వాయిదా వేసేందుకు ఉపయోగించే హార్మోనల్ మందుల వల్ల అందరికీ ఆరోగ్యకరం కాదని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొందరికి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే? పీరియడ్స్ ను […]

Period Delay Tablets: శ్రావణమాసం ప్రారంభంతో శుభకార్యాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో పెళ్లిళ్లు లేదా ప్రయాణాలు ఉండటం వల్ల కొంతమంది మహిళలు పీరియడ్స్ రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే రుతుక్రమాన్ని వాయిదా వేసేందుకు ఉపయోగించే హార్మోనల్ మందుల వల్ల అందరికీ ఆరోగ్యకరం కాదని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొందరికి ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే?

పీరియడ్స్ ను కొంతకాలం వాయిదా వేసేందుకు వేసుకునే టాబ్లెట్స్ ద్వారా ప్రాజెస్టరాన్ తరహా హార్మోనల్ మందులను కొంతమంది వైద్యులు సూచిస్తారు. ఇవి గర్భాశయ త్వరలో సహజంగా జరిగే మార్పులను ప్రభావితం చేయడం ద్వారా రక్తస్రావం ప్రారంభాన్ని ఆలస్యం చేస్తాయి. అయితే దీనికోసం ఎప్పుడ? ఎలా మందులు తీసుకోవాలి అనేది వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, రుతు చక్రం పై ఆధారపడి ఉంటుంది. పీరియడ్స్ సమయంలో కడుపు, నడుము నొప్పి వంటి సంకేతాలు ఉంటాయి. దీంతో చాలామంది మహిళలు దీనిని వాయిదా వేసుకునేందుకు టాబ్లెట్స్ వేసుకుంటారు. అయితే ఆ తర్వాత కొందరిలో క్రాంప్స్, పొత్తికడుపులో అసౌకర్యం వంటివి ఉంటాయి. మరికొందరిలో తీవ్రమైన తలనొప్పి కూడా ఉండవచ్చు. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అంతేకాకుండా పీరియడ్స్ వాయిదా వేయడానికి టాబ్లెట్ వేసుకునే ముందు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైద్యులను సంప్రదించాలి.

సాధారణంగా మహిళల ఆరోగ్యానికి పీరియడ్స్ సక్రమంగా ఉంటేనే బెటర్ అని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. అయితే రుతుక్రమంలో తరచూ మార్పులు రావడానికి హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, థైరాయిడ్ వంటి సమస్యలు ఉండవచ్చు. అందువల్ల పీరియడ్స్ సక్రమంగా లేనివారు సైతం వైద్యులను సంప్రదించి ఆరోగ్య విషయాలను తెలుసుకోవాలి. రుతుక్రమం అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయమని.. ఈ సక్రమంగా ఉంటేనే ఉండగలుగుతారని చెప్పడం కన్నా.. ఇందులో సమస్యలు ఉన్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే కొందరికి ప్రత్యేక ఆరోగ్య లక్షణాల కారణంగా అనుకున్న సమయానికి ఉండకపోవచ్చు. ఇలాంటి అప్పుడు వెంటనే ఆందోళన పడకుండా కొన్ని రోజులపాటు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇతర ఆరోగ్య సమస్యలు వస్తుంటే అప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిది. అయితే ఇది సక్రమంగా ఉండాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి అని అంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది శారీరక శ్రమ లేకపోవడం వల్ల పీరియడ్స్ సక్రమంగా ఉండడం లేదని కొందరు చెబుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper