Transgender Health: ఒక మనిషి పుట్టుకలో అతని అవయవాలు.. లక్షణాలను బట్టి అతడు పురుషుడా? లేదా స్త్రీనా? అని గుర్తిస్తారు. అయితే కొందరు పుట్టుకతో ఈ రెండు లింగాల్లో ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఆ తరువాత వారితో అనేక మార్పులు వస్తాయి. ఆడవారిగా పుట్టిన వారు.. వారిలో ఉండే పురుష లక్షణాలతో మగవారిలా మారిపోతారు. మగవారిలా పుట్టిన వారిలో స్త్రీకి చెందిన లక్షణాలు ఉండడంతో వారు ఆడవారిలా జీవిస్తారు. ఇలా రూపం ఒకలా ఉండి.. వారిలో భావాలో మరోలా ఉండడంతో వారిని ట్రాన్స్ జెండర్ అని అంటున్నారు. సమాజంలో ఇప్పుడిప్పుడే వీరికి గౌరవం పెరుగుతోంది. వీరూ సొంతంగా బతకగలుగుతున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ ఆరోగ్య పరంగా వీరికి అనేక సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో కొందరికీ ఓ సందేహం కలుగుతుంది. ట్రాన్స్ జెండర్స్ కు పీరియడ్స్ వస్తాయా? అనేది. మరి ఆ విషయంలోకి వెళితే..
Also Read: ఏం జరిగినా సరే.. అంతా మీ మంచికే.. గుర్తుంచుకోండి..
సాధారణంగా మహిళలకు రుతు చక్రం ఉంటుంది. వారి శరీరంలో ఉండే చెడు రక్తం ప్రతీ నెలా ఒక ప్రత్యేక తేదీల్లో రుతు స్త్రావం ద్వారా బయటకు వెళుతంది. దీనినే పీరియడ్స్ అని అంటారు. ఇది 12 లేదా 15 ఏళ్ల వయసు నుంచి 50 నుంచి 60 ఏళ్ల వరకు కొనసాగుతాయి. అయితే రూపం మగవారిలా ఉండి.. ఆడవారిలా ఉండే ట్రాన్స్ జెండర్ లో కూడా పీరియడ్స వస్తాయా? అని కొందరు చర్చించుకుంటున్నారు. కొందరు ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ ద్వారా అవయవాలను మార్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇది కూడా ఉంటుందా? అనేది సందేహం.
అయితే కొందరు వైద్యులు చెబుతున్న ప్రకారం.. ట్రాన్స్ జెండర్ అనేది ఫీలింగ్స్ మాత్రమే. పురుషునిలా జన్మించిన ఒక వ్యక్తి తనలో భావాలు ఆడవారిలా మారుతూ ఉంటాయి. అంటే మానసికంగా మాత్రమే వారు ఇలా ప్రవర్తిస్తారు. వారి అవయవాలల్లో ఎటువంటి మార్పులు ఉండవు. కొందరు ప్రత్యేకంగా సర్జరీ చేసుకున్నా.. కూడా వారిలో ఎటువంటి పీరియడ్స్ రావు. ఎందుకంటే పీరియడ్స్ అనేది పుట్టుకతో జన్మించిన ఆడవారికి మాత్రమే ఉంటాయి.. అనేది కొందరు వైద్యుతు చెబుతున్న వాస్తవం.
ట్రాన్స్ జెండర్ లో పీరియడ్స్ రాకపోయినా నెలలో కొన్ని రోజుల పాటు వారు మూడ్ స్వింగ్ లోకి వెళ్లిపోతారు. అంటే పీరియడ్స్ వచ్చిన విధంగానే వారు ప్రవర్తిస్తారు. అయితే ఇక్కడ ఓ విషయం ఏంటంటే.. పుట్టుకతో ఆడవారిలా ఉండి.. మగవారిలా ట్రాన్స్ జెండర్ గా మారిపోయిన వారిలో మాత్రం పీరియడ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వీరి ప్రవర్తన మాత్రమే మగవారిలా ఉంటుందని.. అవయవాలు ఆడవారిలా ఉంటాయని చెబుతున్నారు.
Also Read: చెడు కొలెస్ట్రాల్ ను పెంచే అలవాట్లు ఇవీ..
ఒకప్పుడు ట్రాన్స్ జెండర్ అంటే సమాజంలో వింతగా చూసేవారు. కానీ ఇప్పుడు వారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రత్యేక కేటగిరీ కాలం కేటాయించి వారికి వివిధ అవకాశాలను అందిస్తోంది. అయితే కొందరు మాత్రం డబ్బుల కోసం ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీరి వల్ల అమాయకులకు చెడ్డపేరు వస్తోంది.