Homeలైఫ్ స్టైల్Top Five Regrets of the Dying: ప్రతి ఒక్కరూ చనిపోయే ముందు ఈ ఐదు...

Top Five Regrets of the Dying: ప్రతి ఒక్కరూ చనిపోయే ముందు ఈ ఐదు విషయాల్లో బాధపడతారు.. అవి ఏంటి

Top Five Regrets of the Dying: జీవితం సంతోషంగా ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు.. ఆ ఆనందమైన జీవితం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే జీవితాంతం అనుకున్న పనులు చేయలేని కొందరు చివరి నిమిషంలో ఐదు విషయాల్లో తీవ్రంగా ఆలోచిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన బ్రోని వేర్ తన పుస్తకం ద్వారా ప్రతి మనిషి చనిపోయే ముందు ఐదు విషయాలను ఎక్కువగా ఆలోచిస్తారని తెలిపింది. అయితే ఆమె చనిపోతానని తెలిసే కొద్ది […]

Top Five Regrets of the Dying: జీవితం సంతోషంగా ఉండాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు.. ఆ ఆనందమైన జీవితం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే జీవితాంతం అనుకున్న పనులు చేయలేని కొందరు చివరి నిమిషంలో ఐదు విషయాల్లో తీవ్రంగా ఆలోచిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన బ్రోని వేర్ తన పుస్తకం ద్వారా ప్రతి మనిషి చనిపోయే ముందు ఐదు విషయాలను ఎక్కువగా ఆలోచిస్తారని తెలిపింది. అయితే ఆమె చనిపోతానని తెలిసే కొద్ది రోజుల ముందు ఈ పుస్తకాన్ని రచించడం గమనార్హం. ఆ ఐదు విషయాలు ఏవో ఇప్పుడు చూద్దాం..

ఇతరులను ఏమనుకుంటున్నారు అని ఫీల్ కావడం:
చాలామంది తమ జీవితంలో ఎదుటివారి మెప్పును పొందేందుకే ఆరాటపడుతుంటారని బ్రోనీవేర్ తన పుస్తకం ద్వారా తెలిపారు. తమ గురించి కాకుండా ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తారని.. ఇలా తమ కోసం ఎలాంటి పనులు చేయకుండా సమయాన్ని వృధా చేస్తారని పేర్కొంది. ఈ క్రమంలో వారు చనిపోయే ముందు తమ కోసం ఏం చేసుకోలేదు అని బాధపడ్డారని ఈ పుస్తకం ద్వారా తెలుస్తోంది.

జీవితాంతం ఒకే పనికి కేటాయించడం:
జీవితం ఉన్నది అనుభవించడానికి.. అని కొందరు అంటుంటారు. కానీ కొంతమంది మాత్రం ఒకే పనికి అంకితం అవుతారు. జీవితాంతం ఒకే పనిని చేస్తూ రెండో పని గురించి ఆలోచించరు. మరికొంతమంది ఎక్కువగా తమ సమయాన్ని ఉద్యోగానికి కేటాయిస్తూ కుటుంబాన్ని పట్టించుకోరు. ఫలితంగా చివరి సమయంలో వారు జీవితాన్ని అనుభవించలేదు అని బాధపడుతుంటారు.

మనసులో ఎంత ప్రేమ ఉన్నా ఇతరులకు చెప్పకపోవడం:
ఒక మనిషి పై మరొకరికి ప్రేమ ఉంటుంది. కానీ ఆ విషయాన్ని తన లో ఉన్న అహంకారం లేదా ఇతర లక్షణాలతో ఎదుటివారికి చెప్పలేక సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇలా జీవితాంతం తమ ప్రేమను వ్యక్త పరచక చివరి నిమిషంలో బాధపడతారని బ్రోని వేరు తెలిపారు. అయితే కొందరు తమ ప్రేమను చెప్పినా కూడా దానిని సరైన మార్గంలో ఆస్వాదించలేరని కూడా పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులతో సమయం గడపకపోవడం:
ఉద్యోగం, వ్యాపారం కారణంగా చాలామంది తమ కుటుంబ సభ్యులతో సమయం కేటాయించకుండా సమయాన్ని వృధా చేశారని చివరి నిమిషంలో బాధపడతారని ఆమె పేర్కొంది. అందువల్ల ఇప్పుడు ఉన్నవారు తమ విధులకే సమయం కేటాయించకుండా కుటుంబానికి కేటాయించే సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.

ఎక్కువ రోజులు ఒకే చోట ఉండడం:
కొంతమంది ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం ఉన్నచోట నుంచి కదలరు. కానీ మీరు జీవితం చివరి రోజుల్లో ఎంతో బాధపడుతూ ఉంటారు. తమ జీవితంలో ఎక్కువ ప్రయాణాలు చేయలేమని ఫీల్ అవుతూ ఉంటారని ఆమె పేర్కొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper