Homeలైఫ్ స్టైల్Papaya Benefits in Monsoon : వర్షాకాలంలో ఈ పండును ఎందుకు తినాలి? 

Papaya Benefits in Monsoon : వర్షాకాలంలో ఈ పండును ఎందుకు తినాలి? 

Papaya Benefits in Monsoon : వర్షాకాలం రాగానే చల్లటి వాతావరణం ఉంటుంది. కానీ ఇదే సమయంలో వ్యాధులు విజృంభిస్తాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకొని అవకాశం ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ పండును తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంతకీ అది ఏ […]

Papaya Benefits in Monsoon : వర్షాకాలం రాగానే చల్లటి వాతావరణం ఉంటుంది. కానీ ఇదే సమయంలో వ్యాధులు విజృంభిస్తాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేకంగా ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా కాపాడుకొని అవకాశం ఉంటుంది. అయితే వర్షాకాలంలో ఈ పండును తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంతకీ అది ఏ పండు?
మార్కెట్లో నిత్యం విరివిగా అందుబాటులో ఉండే పండు బొప్పాయి. దీనిని చూడగానే నోరూరుతుంది. కానీ దీని కొనుగోలుపై పెద్దగా ఆసక్తి చూపరు. ముఖ్యంగా ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయి వైపు చూడరు. కానీ వర్షాకాలంలో మాత్రం దీనిని తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, పోలేట్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
సాధారణంగా ఈ సీజన్లో వైరల్ ఫీవర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గొంతు ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి బొప్పాయిలో ఉండే పోషకాలు ఉపయోగపడతాయని చెబుతుంటారు. బొప్పాయిలో కేవలం పోషకాలు మాత్రమే కాకుండా జీర్ణ క్రియ కు అవసరమయ్యే ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు సైతం దీనిని తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. తరచుగా కడుపునొప్పి, తీవ్ర అజీర్ణం ఉండేవారు రోజువారి ఆహారంలో దీనిని తీసుకోవచ్చు.
బరువు తగ్గాలని అనుకునే వారు కూడా ఈ పండును ఆహారంగా తీసుకోవాలి. ఇందులో నీటి శాతం అధికంగా ఉండడంతో తక్కువ తీసుకున్న కూడా ఎక్కువగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరకణాలను ఒత్తిడి లేకుండా చేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ పండు చాలా వరకు ఉపయోగపడుతుంది. 30 ఆకుల రసం డెంగ్యూ నివారణలో తోడ్పడుతుంది. అయితే ఇది వైద్యుల సూచన మేరకు మాత్రమే.
అయితే దీనిని తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అతిగా తినడం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గర్భిణీలు, ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. అలాగే శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నవారు సైతం వైద్యుల సలహా మేరకు మితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి.
S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper