spot_img
Homeహెల్త్‌Papaya: పరగడుపున బొప్పాయితో తింటే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు

Papaya: పరగడుపున బొప్పాయితో తింటే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు

Papaya: ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. సాధారణంగా ఈ పండును ప్రతి ఒక్కరూ వాళ్ల డైలీ లైఫ్‌లో చేర్చుకుంటారు. తినడానికి తియ్యగా ఉండే బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ జీర్ణ ప్రకియను వేగవంతం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య తక్కువగా ఉన్నవారు ఈ పండ్లను లేదా ఆకుల జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ పండును తింటే ఆరోగ్యంగా ఉంటారు. అయితే గర్భిణులు మాత్రం ఈ పండును తినకూడదని వైద్య నిపుణులు చెబుుతుంటారు. అయితే చాలామంది ఈ పండును ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తింటుంటారు. ఇలా పరగుడుపున ఈ పండును తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా? అని సందేహ పడుతున్నారు. ఇందులో కెరోటినాయిడ్స్, మోనోటెర్ఫెనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు, మినరల్స్, సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేయడమే. కానీ హాని చేయవని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి పరగడుపున బొప్పాయి పండును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది. శరీరంలో ఉండే టాక్సిన్లను బయటకు పంపడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు రాకుండా ఉండటాన్ని కాపాడుతుంది. కొందరు మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఉదయాన్నే బొప్పాయిని తినడం వల్ల విముక్తి పొందుతారు. కొందరు గ్యాస్ట్రిక్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు డైలీ బొప్పాయి పండు తింటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగకుండా అదుపులో ఉంటాయి. బొప్పాయిలో మైరిసెటిన్, విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తిని కూడా ఇస్తుంది.

ఖాళీ కడుపుతో బొప్పాయి పండు తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఎక్కువగా నీరసం, అలసట సమస్య ఉన్నవారు ఈ పండును ఉదయాన్నే తినడం మేలు. బొప్పాయితో చర్మ ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. దీనిని తినడంతో పాటు ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకున్న చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా యంగ్‌గా ఉండేందుకు సాయపడుతుంది. రోజులో ఉదయం పూట పరగడుపున తింటేనే ఈ ప్రయోజనాలు దక్కుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ప్రయోజనాలను మాత్రమే చేకూరుస్తుంది. ఎలాంటి డౌట్ లేకుండా డైట్‌లో ఈ పండును యాడ్ చేసుకోవచ్చు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా చెప్పడం జరిగింది. ఇవి పాటించే ముందు పండితుల సూచనలు తెలుసుకోవడం ఉత్తమం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper