spot_img
Homeలైఫ్ స్టైల్Fitness tips for effective workout: ఎంతసేపు చేశామన్నది కాదు డ్యూడ్.. ఎలా చేశామన్నది ఇంపార్టెంట్..

Fitness tips for effective workout: ఎంతసేపు చేశామన్నది కాదు డ్యూడ్.. ఎలా చేశామన్నది ఇంపార్టెంట్..

Fitness tips for effective workout: ప్రస్తుత రోజుల్లో వ్యాయామం తప్పనిసరిగా మారింది. అయితే ఒకే రకమైన వర్కౌట్‌ను ప్రతిరోజూ చేయడం కంటే వివిధ పద్ధతుల్లో చేయడం వల్ల శరీరానికి అదనపు శక్తి వచ్చే అవకాశం ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. తాజాగా ప్రచురితమైన BMJ Medicine అధ్యయనం ప్రకారం.. మనం ఎంతసేపు వ్యాయామం చేస్తున్నామన్నదానికంటే ఎంత వెరైటీగా చేస్తున్నామన్నదే ఆరోగ్యానికి కీలకమని తేలింది. అంటే రోజూ ఒకే రకమైన జిమ్ వర్కౌట్ కంటే నడక, పరుగులు, యోగా, క్రీడలు వంటి భిన్నమైన శారీరక కార్యకలాపాలను కలిపి చేయడం శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. మరి BMJ Medicine అధ్యయనంలో ఎలాంటి విషయాలు ఉన్నాయంటే..

ఈ స్టడీ ప్రకారం.. వేర్వేరు రకాల వ్యాయామాలు చేసే వ్యక్తుల్లో మరణ ముప్పు సుమారు 19% వరకు తగ్గినట్లు గుర్తించారు. కారణం ఏమిటంటే, ప్రతి యాక్టివిటీ శరీరంలోని వేర్వేరు కండరాల సమూహాలను పనిచేయిస్తుంది. ఉదాహరణకు నడక వల్ల కాళ్ల కండరాలు బలపడితే, యోగా శరీరానికి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. టెన్నిస్ వంటి క్రీడలు రిఫ్లెక్సెస్, కోఆర్డినేషన్‌ను మెరుగుపరుస్తాయి.అలాగే ‘రిపిటీటివ్ స్ట్రెయిన్’ తగ్గడం. ఒకే వ్యాయామాన్ని ఎక్కువకాలం చేయడం వల్ల కొన్ని కండరాలపై మాత్రమే ఒత్తిడి పెరుగుతుంది. దీంతో గాయాల ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ వ్యాయామాల్లో వైవిధ్యం ఉంటే, శరీరంపై ఒత్తిడి సమానంగా పంచబడుతుంది. దీంతో ఇంజరీలు తగ్గడమే కాకుండా వర్కౌట్‌పై ఆసక్తి కూడా పెరుగుతుంది.

రోజువారీ జీవితంలో చిన్నచిన్న యాక్టివిటీలను కూడా ఇందులో భాగం చేసుకోవచ్చు. ఉదాహరణకు మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, తోట పనులు చేయడం వంటి సాధారణ కార్యకలాపాలు కూడా శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. ఇవి క్రమంగా చేస్తే హృదయ ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఫిట్‌గా ఉండాలంటే ఒకే రకమైన వ్యాయామంపై ఆధారపడకుండా, నడక, రన్నింగ్, యోగా, క్రీడలు వంటి విభిన్న యాక్టివిటీలను కలిపి చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల శరీరం మొత్తం సమతుల్యంగా అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, జీవన నాణ్యత మెరుగుపడుతుంది. అయితే వ్యాయామం చేసేవారు సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. ఆహారం తో పాటు వ్యాయామం చేయడం వల్ల అదనపు శక్తి చేకూరుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper