spot_img
Homeహెల్త్‌Cleanliness : తినేముందు కాళ్లు, చేతులు కడుక్కుంటున్నారా? ఇది కేవలం శుభ్రత కోసమేనా? అంతకు మించి..

Cleanliness : తినేముందు కాళ్లు, చేతులు కడుక్కుంటున్నారా? ఇది కేవలం శుభ్రత కోసమేనా? అంతకు మించి..

Cleanliness : ఇది శరీర శక్తిని చూపిస్తుంది. ఇది తిన్నది సాఫీగా జీర్ణం అవడానికి, ఆహారం నుంచి పోషణను గ్రహించడానికి తోడ్పడుతుంది. అలాగే ఈ అలవాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది కూడా. ధార్మిక, సాంస్కృతిక కోణంలో చూసుకున్నట్లైతే తనడానికి ముందు కాళ్లను, చేతులను, ముఖాన్ని కడుక్కోవడం అంటే భక్తిశ్రద్ధలతో ఆహారాన్ని తీసుకోవడం అంటారు నిపుణులు.  ఇది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయంగా కూడా భావిస్తుంటారు. ఈ అలవాటు  ఆరోగ్యం గురించి ఎంతో అవగాహనను కలిగించడంలో సహాయం చేస్తుంది.

కూల్ లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన నీళ్లతో కాళ్లు, చేతులు, ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చేతులు, కాళ్లపై నీళ్లు పోస్తే కాస్త అవి చల్లగా అవుతాయి. దీని వల్ల శరీరం దాని ప్రధాన ఉష్ణోగ్రతను ఉదరంపై కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. అందుకే కాళ్లను, చేతులను, ముఖాన్ని చల్లగా చేస్తే జీర్ణక్రియ మంటను పెంచుతుంది. దీని వల్ల తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. తినడానికి ముందు కాళ్లను, చేతులను కడగడం వల్ల చేతులకు, కాళ్లకు ఉన్న దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాలు తొలగిపోయి ఎలాంటి ఆహారం తిన్నా సరే నష్టం ఉండదు.

అయితే రోజంతా అటూ ఇటూ తిరగడం వల్ల మన ముఖానికి, కాళ్లకు, చేతులకు ఎన్నో రకాల బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి పట్టుకుంటాయి. అందుకే శుభ్రం చేసుకోకుండా తింటే ఇవి మన నోట్లోకి వెళ్తాయి. తద్వారా అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది.  అందుకే తినడానికి ముందు పరిశుభ్రతను పాటించాలి. ఇలా తినడానికి ముందు కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవడం పరిశుభ్రతకు మాత్రమే కాదని ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంటున్నారు నిపుణులు. ఇక కూల్ వాటర్ తో చేతులను, కాళ్లను, ముఖాన్ని కడుక్కోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత ప్రభావితం అవుతుంది.

జీర్ణ మంట మనం తిన్నదాన్ని సరిగ్గా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అలాగే మంచి పోషణను అందించడానికి సహాయం చేస్తుంది. ఇక ఈ అలవాటు వల్ల మనసుకు ప్రశాంతతను వస్తుంది. స్వచ్ఛమైన మనస్సు, శరీరంతో తింటే భావోద్వేగ, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper