Homeహెల్త్‌Brain Hemorrhage: ప్రాణాలు సైతం తీస్తున్న బ్రెయిన్ హేమరేజ్ కేసులు.. లక్షణాలు ఇవే

Brain Hemorrhage: ప్రాణాలు సైతం తీస్తున్న బ్రెయిన్ హేమరేజ్ కేసులు.. లక్షణాలు ఇవే

సాధారణంగా వేసవిలో బ్రెయిన్ హెమరేజ్ కేసులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి. అయితే విపరీతమైన వేడి, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల వల్ల మెదడు రక్తస్రావం బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.

Brain Hemorrhage: ప్రతి సంవత్సరం వేడి మరింత పెరుగుతుంది. రోజు రోజుకు ఎండలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయి ఎండలు నమోదు అవుతున్నాయి. మరోవైపు ఎండ వేడి ఉంటూనే వర్షాలు కూడా కురుస్తున్నాయి. రెండు కలిసి ఉండటంతో ప్రజలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వాతావరణంలో మార్పులు, తినే ఆహారం వంటి వాటివల్ల ఆసుపత్రుల్లో బ్రెయిన్ హెమరేజ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్‌తో సహా అనేక ఆసుపత్రులలో బ్రెయిన్ హెమరేజ్ కేసులు నమోదవుతున్నాయి.

సాధారణంగా వేసవిలో బ్రెయిన్ హెమరేజ్ కేసులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి. అయితే విపరీతమైన వేడి, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల వల్ల మెదడు రక్తస్రావం బారిన పడే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఈ వ్యాధి వల్ల యువత కూడా ఇబ్బంది పడుపతున్నారు. కొందరికి అధిక రక్తపోటు కూడా వస్తుందట. ఎక్కువ ఎండ వేడి, సూర్యరశ్మి, ఉష్ణోగ్రతలతో పాటు ఉండటం. కొందరు వెంటనే వెళ్లి ఏసీలో కూర్చోవడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ ప్రమాదం పెరుగుతుంది అంటున్నారు వైద్యులు.

ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల, తగ్గుదల వల్ల మెదడులోని రక్త ప్రసరణను ప్రభావితం అవుతుంది. ఇది రక్తస్రావానికి కూడా దారితీస్తుంది. కొంతమంది బ్రెయిన్ హెమరేజ్ పేషెంట్లకు వెంటిలేటర్ కూడా పెట్టాల్సే పరిస్థితులు వస్తున్నాయట.
బయట వేడిగా ఉండటం.. ఆఫీసుల్లో, ఇళ్లలో AC ల కింద కుర్చోవడం వంటి వల్ల శరీరం అకస్మాత్తుగా దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి 20 నుండి 25 డిగ్రీల వరకు చేరుకుంటుంది. అటువంటి పరిస్థితిలో మెదడు పనితీరు దెబ్బతింటుంది అంటున్నారు నిపుణులు.

ఉష్ణోగ్రతలో ఇటువంటి ఆకస్మిక మార్పులకు మెదడు సర్దుబాటు వెంటనే చేసుకోదట. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో రక్తస్రావం జరుగుతుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల మెదడులోని నరాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మెదడులోని నరాలు పగిలిపోయి మెదడులో రక్తస్రావం ప్రారంభమవుతుంది. రోగికి సకాలంలో చికిత్స అందించకపోతే ఆ వ్యక్తి మృతి చెందే అవకాశం కూడా ఉందంటున్నారు వైద్యులు. అయితే ఈ వ్యాధి లక్షణాలు కూడా తెలుసుకోండి.

ఆకస్మికంగా తీవ్రమైన తలనొప్పి రావడం. ముఖం తిమ్మిరిగా అనిపించడం, మాట్లాడటానికి ఇబ్బంది పడటం, నడవడానికి ఇబ్బంది పడటం వంటివి జరుగుతాయి. హై బీపీ, పొగ తాగే అలవాటు లేదా ఏదైనా గుండె జబ్బుతో బాధపడేవారికి మెదడు రక్తస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వీరు ఈ సీజన్‌లో తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఎండలో నుంచి ఏసీ దగ్గరకు వెళ్లే కంటే ముందే శరీర ఉష్ణోగ్రతను సాధారణ పరిస్థితి లోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాతనే ఏసీ రూమ్ కు వెళ్లాలి. సూర్యరశ్మి లేని, ఏసీ లేని ప్రదేశంలో ఉండటం మంచిది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper