కల్తీకి కాదేది అనర్హం అన్నట్లు.. వైద్యం కూడా కల్తీ అయిపోయిన ఈ కాలంలో.. ఓ డాక్టర్ ప్రజల క్షేమమే ధ్యేయంగా.. సామాన్యుడికి కూడా తన సమగ్ర వైద్యం అందాలని లక్ష్యంగా ముందుకు సాగడం అంటే మాటలా..? పైగా ప్రపంచంలోని నలభై శాతం మంది మగాళ్ళు, పదిశాతం మంది ఆడాళ్ళు బాధ పడుతోన్న సమస్యకు, పరిష్కారం ఇవ్వగల వృత్తిలో ఉండి కూడా.. సంపాదన కోసం కాకుండా, కేవలం ప్రజలకు దోపిడీ లేని చికిత్సను అందించడమే, తన కర్తవ్యంగా పాటు పడుతోన్న ఆ డాక్టర్ గొప్పదనం గురించి.. పదాలతో ఎంతని వ్యక్తపరచగలం. ఎంత వర్ణించినా అది ఆయన గొప్పతనం ముందు సాటిరాదు కదా. ఆయనే ఇండియాలోనే టాప్ హెయిర్ సర్జన్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ ‘డాక్టర్: జాన్ వాట్స్’. అత్యున్నత స్థానాన్ని అధిరోహించినా.. అహాన్నిగర్వాన్ని దరికి చేరనివ్వని వ్యక్తి. ఆత్మన్యూనతాబాధతో తన దగ్గరికి వచ్చిన వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతోన్న కేశ నూతన వైద్యవిధాత. కేశాల సంరక్షణ పరిధిలోని నేటి వినూత్నమైన సంస్కరణలకు ఆయనొక నూతన ఆద్యుడు. పదేహేను వందల హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలను వందశాతం సక్సెస్ ఫుల్ గా చేసి తెలుగు వారికి గర్వకారణంగా మారిన మన తెలుగు సర్జిన్ ‘డాక్టర్: జాన్ వాట్స్’. ఆయన స్థాపించిన ‘Trichos Hair Transplant and Research Center’ సౌత్ ఇండియాలోనే బెస్ట్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ అవార్డ్ అందుకోవడం మన తెలుగు రాష్ట్రాలకే ఎంతో గర్వకారణం. ఇప్పటికీ మొత్తం ఇండియాలోనే ‘Trichos’ టాప్ లో ఉందంటే అది ‘డాక్టర్: జాన్ వాట్స్’ కచ్చితత్వమైన నిజాయితీ గల వైద్య విధానమే కారణం.
Also Read: మధుమేహంతో బాధ పడుతున్నారా.. ఈ జాగ్రత్తలతో షుగర్ కు చెక్..?
ఇప్పటి ఈ ప్రపంచంలో జుట్టు సమస్య లేని మనిషి లేడేమో. అంతగా మన జీవినవిధానం మారిపోయింది. దాంతో జుట్టు సమస్యే మన దేశంలో పెద్ద బిజినెస్ అయిపొయింది. అందుకే ఎక్కడిక్కడ నకిలీ హెయిర్ క్లినిక్స్ పుట్టుకొచ్చాయి. అసిస్టెంట్స్ , పళ్ళ డాక్టర్లు హెయిర్ సర్జెన్స్ గా చలామణి అవుతున్నారు. నర్సులు ఏకంగా హెయిర్ క్లినిక్స్ పెట్టి.. పచ్చని బతుకులను రోగాల వలయంలోకి నెట్టేసి పచ్చనోట్లను పోగుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య ‘తారిక్ కుస్సు’ అనే వ్యక్తికి ఓ నకిలీ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసి అతని కంటిచూపును పోగొట్టాడు. దాంతో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారిస్తే.. ఆ సర్జెన్ అసలు సర్జనే కాదని తేలింది. చెన్నైలో ఏకంగా ఓ డాక్టర్ నే పొట్టన పెట్టుకుంది ఓ నకిలీ హెయిర్ క్లినిక్. ఎంత దురదృష్టం ఇది.. ఒక నిజమైన డాక్టరే.. ఒక నకిలీ డాక్టర్ చేతిలో మోసపోయి ప్రాణాలే పోగొట్టుకుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి ? నకిలీ సర్జెన్స్ ను అసలు సామాన్యులు గుర్తించగలరా ?
మరి ఈ నకిలీ డాక్టర్ల నుండి అమాయిక ప్రజలను కాపాడేవాడు ఎవడు ? పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో రాజకీయాలతో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. ఇక పరిష్కరించాల్సిన న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థలు రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తోన్న వేల సమస్యలతో, తమ సమస్యలనే పరిష్కరించకోలేక సతమతమవుతున్నాయి. మరోపక్క కనీస అనుభవం లేని వారు హెయిర్ చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కనీసం, క్లినిక్స్ లో నిపుణులతో పాటు కనీస సదుపాయాలు కూడా లేకుండానే సర్జరీలు చేసి ప్రాణాల మీదకు తేస్తున్నారు. ఇలా ఫేక్ సర్జెన్స్ వల్ల జరుగుతోన్న దారుణాలన్నీ కళ్ళెదుట కనబడుతున్నా.. నకిలీ క్లినిక్ ల చుట్టూ అమాయికులు ఇంకా తిరిగుతూనే ఉండటం ఎంత అమాయకత్వం..? డబ్బులు ఇచ్చి హత్య చేయించుకోవడం అంటే ఇదేనేమో. మరి ఏమి చేయగలరు ? పాతికేళ్ళకే పెళ్లి కాకుండానే బట్టతల వచ్చేసింది. ఆ బట్టతల బాధితులకు అతితక్కువ ఖర్చుకే హెయిర్ ప్లాంటేషన్ అంటూ ఆకర్షిస్తున్నాయి ఫేక్ హెయిర్ క్లినిక్స్.
అందుకే వారి నుండి అలాంటి అమాయికులను కాపాడాలి అనే గొప్ప ఉద్దేశ్యంతో ‘డాక్టర్: జాన్ వాట్స్’ ముందుకు వచ్చారు. టాప్ సర్జెన్ అయి ఉండి కూడా సామాన్యుడికి కూడా తన వైద్యం అందాలని నెలలో ఐదు నుండి పదిరోజుల తన విలువైన సమయాన్ని సామాన్యుల కోసం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఫేక్ క్లినక్స్ అండ్ నకిలీ డాక్టర్ల బారిన ఎవ్వరూ పడకుండా ‘డాక్టర్: జాన్ వాట్స్’ చేస్తోన్న ఈ సేవ అనీర్వచనమైనది. ఎందుకంటే మెడికల్ టూరిజానికి కేంద్రంగా మారిన హైదరాబాద్లో ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ ధరకే మెరుగైన వైద్యం పొందే వీలుంది కాబట్టి, విదేశాల నుంచి కూడా ఇక్కడికి కొంతమంది రోగులు వస్తుంటారు. వారు ఖర్మ కాలి ఈ నకిలీ హెయిర్ క్లినిక్స్ భారిన పడి నష్టపోయి విమర్శలు చేస్తే.. అది మన దేశానికే అవమానం కాదా. ఇప్పటికైనా మన అధికారులు నకిలీ హెయిర్ క్లినిక్స్ పై చర్యలు తీసుకుంటే ‘డాక్టర్: జాన్ వాట్స్’ లాగా ఎంతోమంది ప్రాణాలను కాపాడినవారవుతారు.
Also Read: 6,000 మంది అమ్మాయిలతో శృంగారం చేసిన ఘనుడు.. చివరకు..?
ఈ దేశంలో కొత్త పుంతలు తొక్కుతున్న ‘హెయిర్ మాఫియా’ తీరును అరికట్టినవారవుతారు. అసలు బట్టతల అనే వలయంలో చిక్కుకుని బాధతో వచ్చిన వాడికి సాంత్వన కలిగించాల్సింది పోయి.. వాడి దగ్గర సాంతం దండుకొని దిక్కుమాలిన వైద్యం చేయటం ఎంత బాధకరమైన విషయం. ఏది ఏమైనా ఈ ఫేక్ వైద్య వెర్రితలలు వేయడం మొదలు పెట్టాకే, మనిషి బొచ్చుకు బంగారం అంత ‘రేటు’ కట్టేయడం సర్వసాధారణమైపోయింది. నిజమే.. లక్షలు పెట్టి క్లినిక్స్ పెట్టింది, ప్రజా సేవ చేయడానికి కాదు కదా.. అందుకే దురదృష్టవశాత్తూ మనిషి వీక్ నెస్ ను ఆసరా చేసుకుని, సర్జరీ రేట్లు తగ్గించి మాయగాళ్ళు బూటకపు వైద్యంతో బట్టతలలతో పాటు వారి జేబులను కూడా గుల్ల చేస్తున్నారు.
పెద్దలు ‘వైద్యో నారాయణో హరిః’ అన్నారు కదా.. అందుకేనేమో ఈ నకిలీ డాక్టర్లు తమ వైద్యంతో అమాయక జనాన్ని ఎలాంటి రిజర్వేషన్ కూడా లేకుండా డైరెక్ట్ గా ఆ నారాయణుడి దగ్గరకే పంపుతాన్నారు. అందుకే మేల్కొందాం. ఈ హెయిర్ సర్జన్ కి చికిత్స ఎలా చేయటమనేదే కాదు, ఎలా చేయకూడదో కూడా తెలియాలి. ఈ చికిత్స ఎంత మేలు చేస్తోందో.. సరైన సర్జన్ చేయకపోతే అంత ప్రమాదంలోకి కూడా నెట్టేస్తోంది. అందుకే సర్జన్ ఎన్నుకున్నేటప్పుడే జాగ్రత్త వహించండి. టాప్ సర్జన్, గోల్డ్ మెడలిస్ట్ ‘డాక్టర్: జాన్ వాట్స్’గారి లాంటి మహోన్నతమైన వైద్యులు సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ముందుకు వస్తోన్నప్పుడు, వారి సేవలను వినియోగించుకోవడం బట్టతల బాధితులకు నిజంగా ఓ వరమే.. మరి బాల్డ్ నెస్ బాధితులందరూ ఆ వరాన్ని అందుకోవాలని ఆశిద్దాం.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Good news for bald victims
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com