Hair Loss : కాలం మారుతున్న కొద్ది జనాభా కూడా పెరుగుతుంది. దీంతో వాతావరణం పోల్యూషన్ గా మారుతుంది. ఒకప్పుడు జనాభా తక్కువగా ఉండి వాతావరణం స్వచ్ఛంగా ఉండడంతో ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాతావరణం కాలుష్యం కావడంతో అనారోగ్య పాలవుతున్నారు. తాగే నీరు నుంచి తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి కలషితం కావడంతో శరీరం అనేక రకాల అవస్థలు పడుతోంది. దీంతో వయసు తర్వాత వచ్చే సమస్యలకంటే మధ్య వయసులోనే రావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతి మనిషికి జుట్టు అందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మగవారు యుక్త వయసులో ఉన్నప్పుడు జుట్టుతోనే అందంగా కనిపిస్తారు. కానీ కొందరికి చిన్న వయసులోనే బట్టతల రావడం ఆందోళన కలిగిస్తుంది. అయితే బట్టతల రావడానికి అనేక రకాల విటమిన్ ల లోపం ఉంటుంది. ఈ సమస్య రాకుండా ముందుగానే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పరిష్కారం అవుతుంది. ఆ పదార్థాలు ఏమో ఇప్పుడు చూద్దాం..
Also Read : రోజ్మరీ పువ్వులు జుట్టుకు ఇంత ఉపయోగపడతాయా? వామ్మో వదిలేయవద్దు అయితే?
నేటి కాలంలో జుట్టు సమస్యతో బాధపడే వారు ఎక్కువగానే ఉన్నారు. మగవారిలో బట్టతల రావడం.. ఆడవారిలో జుట్టు మారిపోవడంతో నిరాశతో ఉంటారు. జుట్టు రాలిపోవడం, బట్టతల రావడం ఆరోగ్య లోపమే అని తెలుసుకోవాలి. బట్టతల పూర్వజన్లు లోపమని కొందరు భావించారు. కానీ కొందరికి చిన్న వయసులోనే రావడంతో ఇది వాతావరణ కాలుష్యలోపమేనని, శరీరంలో విటమిన్లు తక్కువ కావడమేనని వైద్యులు తేల్చారు.
బట్టతల రావడానికి ప్రధాన కారణం డి విటమిన్ లోపమని కొందరు వైద్యులు చెబుతున్నారు. అయితే డి విటమిన్ శరీరంలో సమృద్ధిగా ఉండాలంటే.. ప్రతిరోజు ఉదయం లేవగానే సూర్యుడికిరణాలు పడేలా కాసేపు ఎండలో ఉండాలి. అయితే ఉదయం ఎనిమిది గంటల లోపు అయితేనే ఆ కిరణాలు ఆరోగ్యకరమైనవి. అలాగే డి విటమిన్ శరీరంలో సమృద్ధిగా ఉండడానికి గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటితోపాటు పుట్టగొడుగులు తీసుకుంటూ ఉండాలి. వీటిల్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
ఏ విటమిన్ లోపంతో కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఆకుకూరలు ఎక్కువగా తినాలి. అలాగే క్యారెట్ ను నిత్యం ఆహారంలో చేర్చుకుంటూ ఉండాలి. చిలకడ దుంప వంటివి కూడా తినడం వల్ల శరీరంలోకి ఏ విటమిన్ సమృద్ధిగా వస్తుంది. దీంతో బట్టతల మాత్రమే కాకుండా చుండ్రు సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు.
శరీరంలో ఈ విటమిన్ లోపంతో కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ విటమిన్ సమృద్ధిగా ఉండాలంటే బాదం ఎక్కువగా తినాలి. పాలకూర తో పాటు ఆవకాడో, పొద్దుతిరుగుడు గింజలు వంటివి తీసుకుంటూ ఉండాలి. వీటివల్ల శరీరంలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
సి విటమిన్ శరీరానికి చాలా అవసరం. ఇది లేకపోతే శక్తి తగ్గుతుంది. అందువల్ల సి విటమిన్ లభించే ఫ్రూట్స్ను ఎక్కువగా తీసుకోవాలి. సిట్రాస్ పండ్లు, నారింజ, నిమ్మ, బ్రోకలీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. సి విటమిన్ ఎక్కువగా ఉంటే జుట్టు సమస్య ఉండదు. దీని లోపంతో కూడా జుట్టు రాలడం, బట్టతల రావడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు.
Also Read : పాత పద్దతులే బెటరా? అందుకే నిపుణులు జుట్టుకు నువ్వుల నూనె మంచిది అంటున్నారా?