Vivek Athteya : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రజనీకాంత్ (Rajinikanth)…ఆయన చేసిన సినిమాలకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుండటం వల్ల ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి గుర్తింపైతే లభించింది. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులుగా మారిపోయారు… ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు (Lokesh Kankaraj) దర్శకత్వంలో కూలీ(Cooli) అనే సినిమా చేస్తున్నాడు. అలాగే నెల్సన్ (Nelsan) డైరెక్షన్లో జైలర్ 2 (Jailer 2) అనే సినిమాని కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో చాలా బిజీగా ఉన్న ఆయన తన తదుపరి సినిమా కోసం కూడా కొన్ని కథలను వింటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : భైరవం ట్రైలర్ లో ఎవ్వరు గమనించని విషయాలు ఇవే…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో డిఫరెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వివేక్ ఆత్రేయ (Vivek Athteya) రజనీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ సోషల్ మీడియా మొత్తం ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది…అందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే అయితే చేద్దాం… రీసెంట్ గా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) రజనీకాంత్ గారిని కలిసి ఒక కథ అయితే వినిపించారట…
ఆ కథ రజనీకాంత్ కు బాగా నచ్చినప్పటికి ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేయలేదట. మరి మొత్తానికైతే ఈ సినిమాని రజనీకాంత్ చేస్తే బాగుంటుందని తన సన్నిహితులు సైతం చెబుతుండడంతో రజినీకాంత్ ఈ సినిమా చేయాలా వద్దా అనే ఒక చిన్న డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందుకోసమే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
మరి ఏది ఏమైనా కూడా రజనీకాంత్ వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్లలో వివేక ఆత్రేయకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ప్రస్తుతం ఆయన రజనీకాంత్ ను డైరెక్షన్ చేసే స్థాయికి ఎదిగాడు అంటే తన తదుపరి సినిమాని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…