Bhairavam : సుమారుగా 9 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత మంచు మనోజ్(Manchu Manoj) సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘భైరవం'(Bhairvam Movie). ఈ చిత్రం లో ఆయనతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohit) కూడా నటించారు. ఈ నెల 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న రాత్రి ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి లాంచ్ చేశారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ ‘గరుడన్’ చూడని ప్రేక్షకులకు ఈ ట్రైలర్ సూపర్ గా అనిపిస్తుంది కానీ, గరుడన్ చూసినవాళ్లకు మాత్రం ‘మక్కీకి మక్కీ దింపేసారుగా..ఎక్కడా మార్చలేదు’ అని అనిపిస్తుంది. అయితే ఈ ఈవెంట్ లో మంచు మనోజ్ వెక్కి వెక్కి ఏడ్చిన ఘటన, అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
మూవీ టీం ముగ్గురు హీరోలకు ఈ ఈవెంట్ లో స్పెషల్ AV లు వేశారు. మంచు మనోజ్ తన AV ని చూస్తున్నప్పుడు బాగా ఎమోషనల్ అయిపోయాడు. కష్టసమయంలో ఫ్యాన్స్ తనకు అండగా ఉన్నారు అనే విషయాన్ని గుర్తు చేసుకొని ఏడ్చేశాడు. ఆయన పక్కనే కూర్చున్న బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ లు మనోజ్ ని ఓదార్చారు. ఆ తర్వాత ఆయన స్టేజి మీదకు ఎక్కిన తర్వాత మాట్లాడుతూ ‘సొంత మనుషులే నన్ను దూరం పెట్టారు..నాకు కేవలం నా భార్య, నా బిడ్డ మాత్రమే ఇప్పుడు తోడు ఉంది. రేపు నా బిడ్డ ఎదిగిన తర్వాత మన కుటుంబం ఏది అని అడిగితే, మీ అందరినీ చూపించి ఇదే నా కుటుంబం అని చెప్తాను’ అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు మనోజ్. ఈ ఈవెంట్ లో ఆయన తన వ్యక్తిగత విషయాల గురించే ఎక్కువగా మాట్లాడాడు.
Also Read : భైరవం ట్రైలర్ లో ఎవ్వరు గమనించని విషయాలు ఇవే…
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘కట్టు బట్టలతో నన్ను నా ఇంటి నుండి గెంటేశారు. చిన్నప్పటి నుండి నాతో ఉన్న వస్తువులను కూడా లాగేసుకున్నారు. నా కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాంటి సమయం లో నా అభిమానులు 20 కార్లు తీసుకొచ్చి., నీకు మేము ఉన్నాము రా అన్నా అన్నారు. నా తల్లితండ్రులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీ అభిమానం నాకు ఇలా దొరికింది. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’ అంటూ అభిమానులను ఉద్దేశించి కామెంట్స్ చేసాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మనోజ్ ఏడ్చిన వీడియో బాగా వైరల్ అవ్వడం తో నెటిజెన్స్ కొంతమంది బాధపడ్డారు, మరికొంతమంది నటించింది చాలు ఇక ఆపురా అంటూ కామెంట్స్ చేశారు. ఒక హీరో పై భిన్నమైన అభిప్రాయాలూ ఉండడం సహజమే, కానీ మనోజ్ ఏడుపు లో ఎలాంటి నటన లేదు, సహజంగానే ఆయన ఎమోషనల్ అయ్యాడు.
Overwhelmed with emotion, @HeroManoj1 broke into tears at the #Bhairavam trailer launch.#ManchuManoj pic.twitter.com/AcSwTDTVKi
— M9 NEWS (@M9News_) May 18, 2025