Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే…ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరూ యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటి అంటే వాళ్లయితే ఫ్రెష్ థాట్స్ తో సినిమాలను చేయడమే కాకుండా ఈ జనరేషన్ కి తగ్గట్టుగా సినిమాలను చేసి సక్సెస్ లను సాధిస్తారనే ఒక దృఢ సంకల్పంతో సీనియర్ హీరోలు అందరూ యంగ్ దర్శకులకే అవకాశాలనైతే ఇస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సైతం యంగ్ డైరెక్టర్స్ తో సినిమా చేయాలంటే ఆ దర్శకుడిలో సినిమా తీయాలనే ఉత్సాహం అతనికి కనిపించాలి. అలాగే అతనికి అంతకుముందు వరుస సక్సెస్ లను సాధించిన హిస్టరీ ఉండాలి. దానికి తగ్గట్టుగా అతను చెప్పిన కథ చిరంజీవి కి బాగా నచ్చాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మెగాస్టార్ చిరంజీవి ఒక దర్శకుడితో సినిమా చేస్తాడు. వీటిలో ఏది తక్కువైనా కూడా చిరంజీవి అతనితో సినిమా చేయడానికి ఆసక్తి అయితే చూపించడు.
ఇక ప్రస్తుతం చిరంజీవి వశిష్ట (Vashishta) డైరెక్షన్లో విశ్వంభర (Vishwambhara) సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని తొందరగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 22వ తేదీ నుంచి అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో చేయబోతున్న సినిమా షూటింగ్లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
మరి ఈ సినిమా తొందరగా కంప్లీట్ చేసి 2026 సంక్రాంతి బరిలో నిలపాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే చిరంజీవి పేరు మరొకసారి పాన్ ఇండియా వైడ్ గా మార్పురుగుతుందనే చెప్పాలి.
ఈ మూవీతో వరసగా తనకు తొమ్మిదోవ సక్సెస్ వచ్చి త్రిబుల్ హ్యాట్రిక్ ని నమోదు చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇప్పటివరకు అనిల్ రావిపూడి కి వరుస సక్సెస్ లు అయితే దక్కుతున్నాయి. మరి చిరంజీవితో చేస్తున్న సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే… ఈ సినిమా తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…