Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ కుర్ర హీరోకి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలే. ఈ రెండు సినిమాలు నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో ఆయన స్థానాన్ని సుస్థిరపరిచాయి. అయితే ‘గీత గోవిందం’ తర్వాత ఈయన చేసిన చిత్రాల్లో ‘టాక్సీ […]

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ కుర్ర హీరోకి ఇంత క్రేజ్ ఉండడానికి కారణం ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలే. ఈ రెండు సినిమాలు నేటి తరం జెన్ జీ ఆడియన్స్ లో ఆయన స్థానాన్ని సుస్థిరపరిచాయి. అయితే ‘గీత గోవిందం’ తర్వాత ఈయన చేసిన చిత్రాల్లో ‘టాక్సీ వాలా’ ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. మిగిలిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఇక ఆయన చివరి చిత్రం ‘ది కింగ్డమ్’ కూడా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బిలో యావరేజ్ గా నిల్చింది. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఒక పాత వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

‘గీత గోవిందం’ తర్వాత ఈ కుర్ర హీరో 2019 వ సంవత్సరం లో తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రాన్ని మొదలుపెట్టారు. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం మాళవిక మోహనన్ ని ఎంచుకున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే కూడా మరో హీరోయిన్ పాత్రకు ఎంపిక అయ్యింది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ముహూర్తపు షాట్ కి క్లాప్ కూడా కొట్టారు. అలా అట్టహాసం గా మొదలై , కొన్ని రోజులు షూటింగ్ కూడా జరుపుకున్న ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. సినిమా స్క్రిప్ట్ విషయం లో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ మధ్య ఏర్పడిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగానే ఈ చిత్రాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. కేటాయించి 50 కోట్ల బడ్జెట్ లో 6 కోట్లు ఖర్చు కూడా చేశారు.

ఇదంతా ఇప్పుడు వృధా అయిపోయింది. హాలీవుడ్ రేంజ్ హై స్టాండర్డ్స్ తో ee చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు కానీ బ్యాడ్ లక్. లైగర్ , ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలకు బదులుగా ఈ సినిమాని ఒప్పుకొని చేసుంటే బాగుండేది అంటూ సోషల్ మీడియా లో విజయ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ , ‘రణబలి ‘ వంటి చిత్రాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి , వచ్చే ఏడాది మొదటి భాగం లోనే ఈ రెండు సినిమాల్లో ఎదో ఒకటి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper