Vijay Devarakonda: అభిమానులను విపరీతంగా గౌరవించే హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చాలా మంది హీరోలు ఒకటి రెండు సూపర్ హిట్స్ పడగానే తమకు మించిన తోపులు లేరని అనుకుంటారు , సామాన్య అభిమానులను దగ్గరకు వస్తే చాలా చులకన గా చూస్తారు. కానీ విజయ్ దేవరకొండ అలా కాదు , తన అభిమానులను సొంత కుటుంబ సభ్యులు లాగా భావిస్తాడు. రష్మిక తో పెళ్లి జరిగిన తర్వాత , తనకు సోషల్ మీడియా లో ఇంతకాలం సపోర్ట్ చేస్తూ వచ్చిన అభిమానులను ప్రత్యేకంగా ఆహ్వానించి వాళ్లకు విందు భోజనాలు ఏర్పాటు చేసాడు విజయ్ దేవరకొండ. అదే విధంగా ఒక అభిమాని కోరిక ని తీరుస్తూ తన ఇంటికి పిలిపించుకొని భోజనం కూడా పెట్టాడు. వీటితో పాటు పేద విద్యార్థులకు తన సొంత డబ్బులను పంచి పెట్టడం వంటివి కూడా చాలానే చేసాడు.
ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన ‘రణబాలి’ ప్రెస్ మీట్ లో ఒక అభిమాని స్టేజి మీదకు వచ్చి విజయ్ దేవరకొండ భుజం పై చెయ్యి వేసి ఫోటో దిగుతాడు. అప్పుడు విజయ్ దేవరకొండ అసిస్టెంట్ ‘రేయ్ చెయ్యి తియ్యి’ అని అనగా , విజయ్ దేవరకొండ ‘చెయ్యి వేసుకోనివ్వు..ఏమి అవ్వుద్ది ఇప్పుడు..నువ్వు వేసుకో రా బై’ అని అంటాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. విజయ్ దేవరకొండ పై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభిమానుల వల్లే ఏ స్టార్ అయినా నేడు లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు, అలాంటి అభిమానులను దేవుళ్ళు లాగా భావించాలి , వాళ్ళు లేకపోతే మనం లేము అనేది గుర్తించాలి. మన టాలీవుడ్ lo అలా గుర్తించే ఏకైక హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ , అందులో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఆయన హీరో గా నటించిన ‘రణబాలి’ చిత్రం ఈ నెల 15 న ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేయగా , దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ మంచి బలమున్న సబ్జెక్టు తో మన ముందుకు రాబోతున్నాడు , ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడం పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. మరి అభిమానుల కోరికను విజయ్ దేవరకొండ నెరవేరుస్తాడా లేదా అనేది మరో వారం రోజుల్లో తేలనుంది.
View this post on Instagram