Bigg Boss 10 Telugu: సోషల్ మీడియా లో రోహిత్ అభిమానులు రోహిత్ పై తీవ్రమైన కోపం తో ఉన్నారు. నీకు ఓట్లు వేసి విన్నర్ ని చేద్దామని మేము అనుకుంటే , బిగ్ బాస్ లో చేసే పనులైనా అవి?, చాలా తప్పు చేస్తున్నావ్, ఇలాగే ఉంటే విన్నర్ వి కాదు కదా , కనీసం టాప్ 5 కి కూడా వెళ్ళలేవు అంటూ మండిపడుతున్నారు. బిగ్ బాస్ హిస్టరీ లో షణ్ముఖ్ జస్వంత్ లాగా చేతులారా గేమ్ ని నాశనం చేసుకొని గ్రాఫ్ ని తగ్గించుకునే కంటెస్టెంట్ భవిష్యత్తులో ఎవ్వరూ ఉండరేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఈ సీజన్ లో రోహిత్ వచ్చేసాడు. ఇతన్ని చూస్తుంటే షణ్ముఖ్ ని చూస్తున్నట్టుగానే ఉంది. షణ్ముఖ్ తన గేమ్ ని సిరి తో లవ్ ట్రాక్ లో పడి సర్వనాశనం చేసుకున్నాడు. టైటిల్ కొట్టాల్సినోడు రన్నర్ గా నిలిచాడు. ప్రస్తుతానికి రోహిత్ పరిస్థితి కూడా అలాగే అనిపిస్తోంది.
షాలిని తో లవ్ ట్రాక్ ని పెట్టుకొని ఈ వారం తన గేమ్ ని సర్వనాశనం చేసుకున్నాడు. ఎంతలా అంటే , టీం నుండి ఒకరు హై రిస్క్ జోన్ లోకి వెళ్ళాలి అని బిగ్ బాస్ ప్రకటన ఇవ్వగానే, మారుమాట్లాడకుండా షాలిని కోసం హై రిస్క్ జోన్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన ఎలిమినేషన్ కి చాలా దగ్గర్లో ఉన్నాడు. షాలిని ‘వద్దు.. నీలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ హై రిస్క్ లోకి వెళ్లడం కరెక్ట్ కాదు , నేనే వెళ్తాను’ అని చెప్పినప్పటికీ కూడా, రోహిత్ మాట వినలేదు. దీన్ని బట్టీ ఇతనికి తనని నమ్మి ఓట్లు వేస్తున్న లక్షలాది మంది అభిమానులకంటే , షాలిని నే ముఖ్యం అని అనిపిస్తోంది. టాప్ 1 రేంజ్ లో ఉన్న కంటెస్టెంట్ , ఇలా లవ్ ట్రాక్ కి బానిసై ఆట ని చెడగొట్టుకోవడం చూస్తుంటే చాలా బాధ వేస్తోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
మరోపక్క త్రిగున్ రోజు రోజుకి తన ఆతని మెరుగుపర్చుకుంటూ , గేమ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఈ వారం కూడా త్రిగున్ కి సంబంధించిన కంటెంట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. త్రిగున్ లేకపోతే ‘బిగ్ బాస్ 10’ లేదు అనే రేంజ్ కి వెళ్ళిపోయాడు. కానీ రోహిత్ కి ఇప్పుడు షాలిని యే ప్రపంచం లాగా తయారైంది పరిస్థితి. మాటికొస్తే ఆమె గట్టిగా హగ్గు చేసుకోవడం వంటివి చూసే ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగిస్తోంది. గత నాలుగు రోజుల నుండి జియో హాట్ స్టార్ లో లైవ్ చూసేందుకు చాలా చిరాకు పడుతున్నారు నెటిజెన్స్. ఎందుకంటే వీళ్లిద్దరి లవ్ ట్రాక్ అంతటి దారుణంగా ఉంది. ప్రతీ వీకెండ్ లో తనవైపు తప్పు లేకపోయినా నాగార్జున రోహిత్ ని టార్గెట్ చేసి తిట్టడం వల్ల ఆయన అభిమానులు బాగా హార్ట్ అవుతున్నారు. కానీ ఈ వీకెండ్ లో అభిమానులే రోహిత్ కళ్ళు తీర్చుకునేలా నాగార్జున తిట్టాలి అని కోరుకుంటున్నారు. మరి అది జరుగుద్దో లేదో చూడాలి.