Chandrababu Naidu: అక్కడ ఒక్క ఎకరం అక్షరాల రెండు కోట్ల పై మాట. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ భూములను దేకినవాడు లేడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో హైవేలు.. స్టేట్ హైవేలు.. హార్టికల్చర్ హబ్ లు ఏర్పాటు అవుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భూములు బంగారాన్ని మించి ధర పలుకుతున్నాయి.
ఆ ప్రాంతంలో ఓ వైసిపి నాయకుడికి 5 ఎకరాల భూమి ఉంది. బహిరంగ మార్కెట్లో దాని ధర 10 కోట్లకు పై మాట. ఆయన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టులు చేసి కాస్త సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే పార్టీ కోసం భారీగా ఖర్చుపెట్టిన నేపథ్యంలో.. తాను మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉండబోనని ఆ నాయకుడు అధిష్టానానికి చెప్పాడు. అయితే అధిష్టానం తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చింది. తట్టుకోలేక ఎన్నికల ఖర్చు కోసం భూములు అమ్మాలని అతడు డిసైడ్ అయ్యాడు.
బెంగళూరు నుంచి ఒక వ్యాపారవేత్త ఆ భూమిని కొనుగోలు చేయడానికి వచ్చాడు. మరో రెండు రోజుల్లో అయితే ఆ భూమి అమ్ముడుపోయేది. కానీ ఈ లోగానే వైసిపిలో దాదాపు అందరి నాయకుల నామినేషన్లు ఏదో ఒక కారణం వల్ల తిరస్కరణకు గురయ్యాయి. చివరికి ఆ నాయకుడు పరిస్థితిని గమనించి పోటి నుంచి తప్పుకోవడమే మంచిది అనుకున్నాడు. వాస్తవానికి ఆయన నామినేషన్ తిరస్కరణకు గురి కాలేదు. ఆయన నామినేషన్ ను వెనక్కి తీసుకోవలసిన సందర్భం ఏర్పడింది. దీంతో ఆయనకు ఆ ఐదు ఎకరాలు మిగిలింది.
వాస్తవానికి వైసీపీ నాయకులలో ఎవరికి కూడా పోటీ చేయాలి అనే ఉద్దేశం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజలు అనుకూలంగా లేరు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. సంక్షేమ పథకాలను కూడా అదే స్థాయిలో అమలు చేస్తోంది. అందువల్లే చాలామంది వైసిపి నాయకులు పోటీ చేయడానికి ఆసక్తిని చూపించడం లేదు. అందువల్లే స్థానిక ఎన్నికల్లో టిడిపి కూటమికి తిరుగులేకుండా పోతుంది. చంద్రబాబు రాయలసీమ ప్రాంతం మీద చూపించిన ప్రత్యేక దృష్టి వల్ల ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయి. అందువల్లే భూముల ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇందులో టిడిపి నాయకుల కంటే.. వైసిపి నాయకుల ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఈ నాయకుడి ఉదంతం కేవలం ఉదాహరణ మాత్రమే. ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. కాకపోతే వారెవరు బయటపడడం లేదు.