Homeఎంటర్టైన్మెంట్Venkatesh Adarsha Kutumbam: వెంకటేష్ , త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' లో రీమిక్స్ సాంగ్.. ప్లానింగ్...

Venkatesh Adarsha Kutumbam: వెంకటేష్ , త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ లో రీమిక్స్ సాంగ్.. ప్లానింగ్ మామూలుగా లేదుగా..

Venkatesh Adarsha Kutumbam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు . సాధారణంగానే త్రివిక్రమ్ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి , అలాంటిది పీక్ ఫార్మ్ లో వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో తో చేతులు కలిపితే ఆ మార్కెట్ లో […]

Venkatesh Adarsha Kutumbam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు . సాధారణంగానే త్రివిక్రమ్ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి , అలాంటిది పీక్ ఫార్మ్ లో వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో తో చేతులు కలిపితే ఆ మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. ఈ సినిమాకు కూడా మార్కెట్ లో పాన్ ఇండియన్ స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది , ఈ ఏడాది లోనే షూటింగ్ పూర్తి చేసి విడుదల చెయ్యాలని చూస్తున్నారు కానీ , అది జరిగేలా లేదు , సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ చిత్రం లో హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ముందుగా ఈ చిత్రానికి హర్షవర్ధన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు , కానీ అతను అనుకున్న సమయానికి ఔట్పుట్ డెలివరీ చేయలేకపోతుండడం తో , అతన్ని ఈ చిత్రం నుండి తప్పించి తమన్ ని తీసుకున్నారు. తమన్ మ్యూజిక్ కి యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ సినిమాలో తమన్ వెంకటేష్ పాత సినిమాల్లో సూపర్ హిట్ గా నిల్చిన ఒక పాటని రీమిక్స్ చేయబోతున్నాడట. అది ఏ పాటని రీమిక్స్ చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నేటి తరం యూత్ ఆడియన్స్ ఉర్రూతలూ ఊగిపోయేలా , పాత సాంగ్స్ ని తన మార్క్ బీట్స్ తో అప్డేట్ చేసి కంపోజ్ చేయడం లో తమన్ ని మించిన వాళ్ళు ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు.

కాబట్టి ఈ రీమిక్స్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని , థియేటర్స్ లో ఈ పాటని చూసి ఆడియన్స్ ఊగిపోతారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఆ రేంజ్ లో ఈ పాట ఉంటుందా లేదా అనేది. ఇకపోతే ఈ చిత్రం లో యంగ్ హీరో నారా రోహిత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ , వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా అంటే , కామెడీ , సెంటిమెంట్, పదునైన డైలాగ్స్ , ఇవన్నీ ఊహిస్తాము, కానీ ఈ చిత్రం లో అవన్నీ ఉంటూనే , మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా చేర్చాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ , మరి ఆ ఎలిమెంట్ ఏమిటి అనేది తెలియాలంటే టీజర్ వచ్చే వరకు ఆగాల్సిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper