Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Censor Cuts: 'పెద్ది' మూవీ టీంకి ఊహించని షాక్ ఇచ్చిన సెన్సార్.. పాపం...

Peddi Movie Censor Cuts: ‘పెద్ది’ మూవీ టీంకి ఊహించని షాక్ ఇచ్చిన సెన్సార్.. పాపం బుచ్చి బాబు..

Peddi Movie Censor Cuts: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ బుచ్చి బాబు నే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దర్శకత్వం లో , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా బుచ్చి బాబు కనిపించిన ప్రతీ ఛానల్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూస్ […]

Peddi Movie Censor Cuts: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా డైరెక్టర్ బుచ్చి బాబు నే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దర్శకత్వం లో , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘పెద్ది’ చిత్రం వచ్చే నెల 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్ లో భాగంగా బుచ్చి బాబు కనిపించిన ప్రతీ ఛానల్ కి వరుసపెట్టి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ‘పెద్ది’ చిత్రానికి సంబంధించిన అనుభవాలను పంచుకుంటూ , ఆయన మాట్లాడిన మాటలు సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత అర్థం అయ్యింది ఏమిటంటే , బుచ్చి బాబు మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అని , ఆయన విజన్ కి తగ్గ ఔట్పుట్ వచ్చేంత వరకు టెక్నీషియన్స్ నుండి ఎన్ని రీ టేకులు అయినా తీసుకుంటాడని తెలుస్తోంది.

AR రెహమాన్ లాంటి లెజెండ్ తోనే , నాకు ఈ ట్యూన్ నచ్చలేదు అని చెప్పి, ఆయన తన విజన్ కి తగ్గ బెస్ట్ ట్యూన్ ఇచ్చేంత వరకు వదల్లేదు అంటే, బుచ్చి బాబు అవుట్ పుట్ విషయం లో ఎంత కచ్చితమైన మనస్తత్వం తో ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు , ఫైనల్ ఔట్పుట్ విషయం లో కూడా అసలు తగ్గేదేలే అనే మోడ్ లోనే ఉన్నాడు బుచ్చి బాబు. రీసెంట్ గానే ఈ చిత్రం సెన్సె కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఫైనల్ ఎడిట్ వెర్షన్ పూర్తి అయ్యాక 3 గంటల 10 నిమిషాల నిడివి వచ్చిందట. అయితే సెన్సార్ సభ్యులు కట్స్ బాగానే సూచించారట. అందుకు బుచ్చి బాబు కాస్త అసహనం కి గురైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే సినిమాలో , ఆయా సందర్భాల్లో ఇవి అత్యంత కీలకమైనవి అట, అందుకే చాలా వరకు సెన్సార్ సభ్యులను రిక్వెస్ట్ చేసాడట , కానీ వాళ్ళు ఒప్పుకోవడం తో కట్స్ కి అంగీకరించాల్సి వచ్చింది బుచ్చి బాబు.

దాదాపుగా 10 నిమిషాల సన్నివేశాలను సినిమా నుండి తొలగించారట. ఇప్పుడు మూడు గంటల సినిమాగా మిగిలింది , చూడాలి మరి ఈ 10 నిమిషాలు తొలగించడం వల్ల , సినిమా పై ఎలాంటి ప్రభావం పడనుంది అనేది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రేపు ముంబై లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు , ఈ థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ప్రీ సేల్స్ భారీగా పెరుగుతాయనే ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper