Homeఎంటర్టైన్మెంట్Allari Movie Collections: ఆరోజుల్లో 69 లక్షలతో తీసిన 'అల్లరి' చిత్రం ఎన్ని కోట్లు వసూలు...

Allari Movie Collections: ఆరోజుల్లో 69 లక్షలతో తీసిన ‘అల్లరి’ చిత్రం ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా..

Allari Movie Collections: మన టాలీవుడ్ లో ఎంతో గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు , కానీ దురదృష్టం కొద్దీ కొంతమంది క్రియేటివ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఫార్మ్ లో లేరు. అలాంటి డైరెక్టర్స్ లో ఒకరు రవిబాబు. ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు చలపతి రావు అబ్బాయి గా ఈయన హీరోగా వెండితెర అరంగేట్రం చేసాడు, కానీ సక్సెస్ అవ్వలేదు , ఆ తర్వాత విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. […]

Allari Movie Collections: మన టాలీవుడ్ లో ఎంతో గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు , కానీ దురదృష్టం కొద్దీ కొంతమంది క్రియేటివ్ డైరెక్టర్స్ ఇప్పుడు ఫార్మ్ లో లేరు. అలాంటి డైరెక్టర్స్ లో ఒకరు రవిబాబు. ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు చలపతి రావు అబ్బాయి గా ఈయన హీరోగా వెండితెర అరంగేట్రం చేసాడు, కానీ సక్సెస్ అవ్వలేదు , ఆ తర్వాత విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలా ఆర్టిస్టుగా బిజీ అవుతున్న రోజుల్లోనే , డైరెక్టర్ గా మారాడు. అలా ఆయన డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన మొట్టమొదటి చిత్రం ‘అల్లరి’. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఒకే మూస కామెడీ సినిమాలను చూసిన ఆడియన్స్ కి ఈ చిత్రం చాలా కొత్తగా అనిపించింది.

అయితే తన కొడుకు ప్రతిభ గురించి చలపతి రావు గతం లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది . ఆయన మాట్లాడుతూ ‘నటుడిగా అప్పుడప్పుడే రవిబాబు ఇండస్ట్రీ లో స్థిరపడుతున్నారు , సడన్ గా ఒక రోజు వచ్చి నా దగ్గర ఒక మంచి కథ కుదిరింది , డైరెక్షన్ చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పాడు. 70 లక్షల బడ్జెట్ లోనే తీసేద్దాం అన్నాడు. అయితే మనమే తీసేద్దాం , హీరో ఎవరు అని అడిగాను. మన ఈవీవీ సత్య నారాయణ గారి రెండవ కుమారుడు నరేష్ కావాలి అని చెప్పాడు. నేను ఒక్కసారిగా షాక్ కి గురయ్యాను. ఎందుకంటే ఈవీవీ సత్యనారాయణ గారు నాకు అత్యంత సన్నిహితుడు, నాతో నరేష్ గురించి కంగారు పడుతూ ఉండేవాడు , వీడిని అసలు ఏమి చెయ్యాలి అయ్యా , ఆర్టిస్టుగా అసలు పనికిరాడు అనేవాడు’.

‘మీ మొదటి అబ్బాయి ఎలాగో హీరోగా స్థిరపడ్డాడు కదా, నరేష్ ని డైరెక్టర్ ని చేద్దామని చెప్పేవాడిని. అలాంటి వాడిని మా వాడు హీరో గా అడిగేసరికి , అదేంటి రా అని అన్నాను , నా కథకు నరేష్ మాత్రమే సరిపోతాడు అని చెప్పాడు . ఈవీవీ గారికి ఈ విషయం చెప్తే మొదట్లో నమ్మలేదు, లేదండి మావాడు నిజంగానే సినిమా చేద్దామని అంటున్నాడు అని చెప్తే సరే కానివ్వండి మీ ఇష్టం అన్నాడు. ముందుగా మేము మాత్రమే ఈ చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నాము , కానీ సురేష్ గారికి కూడా కథ నచ్చడం తో 50 శాతం నేను బడ్జెట్ పెడుతా అన్నాడు, నేను కూడా అందుకు ఓకే చెప్పాను. రవిబాబు ఈ చిత్రాన్ని కేవలం 69 లక్షల్లోనే పూర్తి చేసాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది , 5 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు చలపతి రావు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper