Homeఎంటర్టైన్మెంట్Hanuman Ansh: 'హనుమాన్ అంశ' చిత్రాన్ని టాలీవుడ్ లో మిస్ అయిన హీరో అతనేనా? చేసుంటే...

Hanuman Ansh: ‘హనుమాన్ అంశ’ చిత్రాన్ని టాలీవుడ్ లో మిస్ అయిన హీరో అతనేనా? చేసుంటే 1000 కోట్లు వచ్చేవి!

Hanuman Ansh: రీసెంట్ గా బాలీవుడ్ లో కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ సాధారణమైనది కాదు. దాదాపుగా 430 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , నేడు తెలుగు లో విడుదలైంది. నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ ఈ స్థాయిలో బ్రహ్మరధం పట్టడానికి కారణం, […]

Hanuman Ansh: రీసెంట్ గా బాలీవుడ్ లో కేవలం 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘హనుమాన్ అంశ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ సాధారణమైనది కాదు. దాదాపుగా 430 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , నేడు తెలుగు లో విడుదలైంది. నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ ఈ స్థాయిలో బ్రహ్మరధం పట్టడానికి కారణం, కథలోని సహజత్వం, ఎమోషనల్ సన్నివేశాలే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నేడు తెలుగు ఆడియన్స్ నుండి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. బుక్ మై షో యాప్ లో ఈ సినిమా తెలుగు వెర్షన్ కి గంటకు 2 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమా తెలుగు వెర్షన్ నుండి 10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉందని అనిపిస్తోంది.

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలుగు లో తన సోదరుడు వెంకటేష్ తో రీమేక్ చెయ్యాలని అనుకున్నాడట. కానీ వెంకటేష్ మాత్రం రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తెలుగు లో కమర్షియల్ గా వర్కౌట్ అవ్వవు , ఒకవేళ మన ఆడియన్స్ కోసం కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే , సినిమాలోని సోల్ మిస్ అవుతుంది . అందుకే వద్దని చెప్పాడట. దీంతో ఈ సినిమాని తెలుగు లో డబ్ చేసి విడుదల చేశారు. సాధారణంగా వెంకటేష్ లో ఆధ్యాత్మిక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఆయన మాట్లాడే మాటలు సామాన్యులకు అంతు చిక్కవు అని అంటూ ఉంటారు. అలాంటి వెంకటేష్ ఈ చిత్రాన్ని చేసుంటే చాలా బాగుండేది అని , అసలు ఎవరికీ పరిచయం లేని వ్యక్తి హీరో గా చేస్తేనే ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే , వెంకటేష్ చేసుంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పేవి అని అంటున్నారు.

అయితే ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి. ఎందుకంటే మన ఆడియన్స్ ఎక్కువ కమర్షియల్ ఫార్మటు సినిమాలకు అలవాటు పడ్డారు. వాళ్లకు ఇలాంటి సినిమాలు ఎక్కించుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ A సెంటర్ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారని ఓపెనింగ్స్ చూస్తేనే అర్థం అవుతోంది. మరి రాబోయే రోజుల్లో మాస్ సెంటర్స్ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని ఆదరిస్తారా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper