Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh title change: సెన్సార్ కష్టాలు.. 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ టైటిల్...

Ustaad Bhagat Singh title change: సెన్సార్ కష్టాలు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ టైటిల్ మారనుందా..? కొత్త టైటిల్ ఏంటంటే!

Ustaad Bhagat Singh title change: ఈమధ్య కాలంలో సెన్సార్ బోర్డు సినిమాల టైటిల్స్ పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాల్లో సన్నివేశాల్లో ఏమైనా అభ్యంతకరం గా ఉంటే కట్స్ చెప్పడం మామూలే. సమాజం లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండే సన్నివేశాలు ఉన్న సినిమాలకు సర్టిఫికేట్ కూడా ఇవ్వని సందర్భాలు ఉన్నాయి, అందుకు లేటెస్ట్ ఉదాహరణ ‘జన నాయగన్’ చిత్రం. ఇప్పుడు చివరికి టైటిల్స్ ని మార్చమని నిర్మాతలను ఒత్తిడికి గురి చేసే స్థాయికి వచ్చేసింది సెన్సార్ బోర్డు. గత నెల విడుదలైన ‘హే బల్వంత్ ‘ చిత్రం అందుకు ఒక ఉదాహరణ. ముందుగా ఈ చిత్రానికి పెట్టిన పేరు ‘హే భగవాన్’. కానీ సెన్సార్ బోర్డు మెంబెర్స్ అభ్యంతరం వ్యక్తం చేయడం తో టైటిల్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మార్చి 19 న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) కి కూడా ఇదే పరిస్థితి రానుందా అనే చర్చలు జోరందుకున్నాయి.

ఎందుకంటే ‘భగత్ సింగ్’ అనే పేరు స్వాతంత్ర సమరయోధుడి కాబట్టి , అలాంటి పేరు సినిమాలకు ఉపయోగించకూడదు అని సెన్సార్ అభ్యంతరం చెప్తే ఏంటి పరిస్థితి?, అప్పుడు కచ్చితంగా మేకర్స్ ‘భగత్ సింగ్ ‘ టైటిల్ ని తీసేసి కేవలం ‘ఉస్తాద్’ అని పెడుతారా? వంటి సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ చిత్రం లో హీరో పేరే భగత్ సింగ్. అలా ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో ఆయన బాల్యం లో కొన్ని సంఘటనలను కూడా చూపిస్తారట. కాబట్టి సెన్సార్ బోర్డు సాధ్యమైనంత వరకు టైటిల్ మార్చమని చెప్పే అవకాశాలు లేవని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ మార్చమని చెప్తే మాత్రం కేవలం ‘ఉస్తాద్’ అనే టైటిల్ ని మిగిలించే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే మార్చి 26 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , మేకర్స్ ఒక వారం రోజులు ముందుకు , అనగా మార్చి 19 న విడుదల చేయబోతున్నారు.

అందుకోసం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జెట్ స్పీడ్ లో పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ షెడ్యూల్ బిజీ గా ఉండడం వల్ల , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ కోసం తమన్ ని ఎంచుకున్నారు. రేపు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ ని మంగళగిరి లో కలిసిన మూవీ టీం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ , మరియు ఇతర విషయాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. మార్చి 10 లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి మొదటి కాపీ రెడీ చెయ్యాలని చూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 16 న జరిగే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular