Homeఎంటర్టైన్మెంట్Mask Man Harish touches wife feet: భార్య కాళ్ళు మొక్కిన మాస్క్ మ్యాన్ హరీష్..కంటతడి...

Mask Man Harish touches wife feet: భార్య కాళ్ళు మొక్కిన మాస్క్ మ్యాన్ హరీష్..కంటతడి పెట్టిస్తున్న ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ ప్రోమో!

Mask Man Harish touches wife feet: మార్చి 15 నుండి స్టార్ మా , జియో హాట్ స్టార్ లలో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ అనే రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇదొక బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో. అందులో ఉన్నట్టుగానే, ఈ షో లో కూడా టాస్కులు ఉంటాయి, గొడవలు కూడా ఉంటాయి. 10 మంది పెళ్ళైన జంటలు, కమిటెడ్ జంటలు ఈ ప్రోగ్రాం లో పాల్గొనబోతున్నారు . ఒక […]

Mask Man Harish touches wife feet: మార్చి 15 నుండి స్టార్ మా , జియో హాట్ స్టార్ లలో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్ ‘ అనే రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇదొక బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో. అందులో ఉన్నట్టుగానే, ఈ షో లో కూడా టాస్కులు ఉంటాయి, గొడవలు కూడా ఉంటాయి. 10 మంది పెళ్ళైన జంటలు, కమిటెడ్ జంటలు ఈ ప్రోగ్రాం లో పాల్గొనబోతున్నారు . ఒక భారీ విల్లాలో వీళ్లంతా ఉంటారు అన్నమాట. అయితే బిగ్ బాస్ కి , ఈ రియాలిటీ షోకి ఉన్న తేడా ఏంటంటే , ఆ షోలో కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ జనాల ఓట్ల ద్వారా ఉండేది. కానీ ఈ షోలో మాత్రం మార్కుల ఆధారంగా ఎలిమినేషన్ ఉంటుంది. శ్రీముఖి ఈ రియాలిటీ షోకి హోస్ట్ కాగా, అనిల్ రావిపూడి, సీనియర్ హీరోయిన్స్ రాధ, లయ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించబోతున్నారు.

ఇప్పటికే ఈ షోకి సంబంధించిన మొదటి ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో వివాదాస్పదంగా మారింది. పచ్చని సంసారాలు మీద నిప్పులు పొసే షో లాగా ఉంది ఇది అంటూ నెటిజెన్స్ మండిపడ్డారు. దీని సంగతి కాసేపు పక్కన పెడితే కాసేపటి క్రితమే ఈ షోకి సంబంధించిన రెండవ ప్రోమో ని విడుదల చేశారు. ఈ ప్రోమో జడ్జీలు విల్లా లోపలకు వెళ్లి, జంటలను పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతూ , వాళ్ళతో కొన్ని ఫన్నీ టాస్కులు కూడా ఆడించారు. ప్రోమో చివర్లో మాస్క్ మ్యాన్ హరీష్ తన భార్య హరిత కాళ్ళు పట్టుకోవడం హైలైట్ గా నిల్చింది. మాస్క్ మ్యాన్ హరీష్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, అంత తేలికగా మర్చిపోయే మనిషి కాదు ఆయన. ‘అగ్ని పరీక్ష’ షో ద్వారా ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి, తనదైన ముద్ర వేసుకొని నాలుగు వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యాడు.

ఇప్పుడు ఈ షో ద్వారా మరోసారి మన ముందుకు రాబోతున్నాడు. ‘అగ్ని పరీక్ష’ షోలో ఈయన తన భార్య ని కొట్టాను అని చెప్పడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆ షో కి జడ్జీలలో ఒకరైన బిందు మాధవి ఇతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అయితే ఈ షోలో ఆయన తన భార్య గురించి వివరిస్తూ, గతం లో ఆమె పై చెయ్యి చేసుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నట్టు ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ‘కొంతమంది ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాము కదా అని చెప్పి , ఆడవాళ్ళ మీద చెయ్యి ఎత్తడం చాలా తప్పు ‘ అంటూ తన భార్య కాళ్లకు మొక్కుతాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే వీళ్లిద్దరు మొదటి వారం లోనే ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper