Homeక్రీడలుక్రికెట్‌India vs England match records: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్.. పాత రికార్డులు పటాపంచలు

India vs England match records: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్.. పాత రికార్డులు పటాపంచలు

India vs England match records: టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో గెలుపును దక్కించుకుంది. తద్వారా దర్జాగా ఫైనల్ వెళ్లి న్యూజిలాండ్ జట్టుతో ట్రోఫీ కోసం అమీ తుమీ తేల్చుకోనుంది. టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో.. ముంబై మైదానంలో అనేక రికార్డులు బద్దలయ్యాయి.. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన […]

India vs England match records: టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఉత్కంఠ గా సాగిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో గెలుపును దక్కించుకుంది. తద్వారా దర్జాగా ఫైనల్ వెళ్లి న్యూజిలాండ్ జట్టుతో ట్రోఫీ కోసం అమీ తుమీ తేల్చుకోనుంది.

టీమిండియా విజయం సాధించిన నేపథ్యంలో.. ముంబై మైదానంలో అనేక రికార్డులు బద్దలయ్యాయి.. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా సంజు (16), రోహిత్, శివమ్ దుబే (15) ను బ్రేక్ చేశాడు. ఇక టీమిండియా నుంచి ఏకంగా 88 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఒకే ఒక ఇన్నింగ్స్ లో ఎక్కువ సిక్సర్లు (19) కొట్టిన జట్టుగా కూడా భారత్ ఈ మ్యాచ్లో నిలిచింది. నెదర్లాండ్స్.. వెస్టిండీస్ జట్లు ఆల్రెడీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు టీమిండియా వారి సరసన చేరింది.

టి20 వరల్డ్ కప్ లో నాకౌట్ మ్యాచ్లలో టీమిండియా నుంచి హైయెస్ట్ భాగస్వామ్యం (97) నిర్మించిన జోడిగా సంజు, ఇషాన్ కిషన్ నిలిచారు. 2007లో యువరాజు, ఊతప్ప (84) రికార్డ్ సృష్టించగా.. ఆ రికార్డును సంజు, ఇషాన్ కిషన్ బద్దలు కొట్టారు.

ఇక మెన్స్ క్రికెట్లో ఎక్కువసార్లు 250+(ఆరుసార్లు) నమోదు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 8.2 ఓవర్లలో 100 పరుగులను పూర్తి చేసింది. ఐసీసీ నిర్వహించే టోర్నీలలో ఇది రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ. న్యూజిలాండ్ జట్టు సెమి ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 7.5 ఓవర్లలో 100 పరుగులు పూర్తిచేసి.. ఈ రికార్డు సృష్టించిన తొలి జట్టుగా నిలిచింది.

ఇక టి20 వరల్డ్ కప్ లో నాకౌట్ మ్యాచ్లలో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన న్యూలాండ్ బ్యాటర్ అలెన్ తో సమానంగా కొనసాగుతున్నాడు బెతల్. బెతల్ 45 బంతుల్లో సెంచరీ చేయగా.. అలెన్ కేవల 33 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. సెమి ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా, టీమిండియా ఏకంగా 34 సిక్సర్లు కొట్టడం విశేషం. ఇక పురుషుల టి20 క్రికెట్లో హైయెస్ట్ రన్స్ (499) నమోదు కావడం ఇది రెండవసారి. గతంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడినప్పుడు 517 పరుగులు నమోదు అయ్యాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper