Homeఎంటర్టైన్మెంట్Harish Shankar comments on Ustaad Bhagat Singh Story: హరీష్ శంకర్ చెప్పేవి మొత్తం...

Harish Shankar comments on Ustaad Bhagat Singh Story: హరీష్ శంకర్ చెప్పేవి మొత్తం పచ్చి అబద్దాలేనా..? ఎల్లుండి తాడోపేడో తేలనుంది!

Harish Shankar comments on Ustaad Bhagat Singh Story: మరో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై ప్రస్తుతానికి అభిమానుల్లో భారీ అంచనాలు అయితే లేవు. మార్చి 14 న విడుదల చేయబోయే థియేట్రికల్ ట్రైలర్ తర్వాతే ఈ సినిమా పై అంచనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు ఆ ట్రైలర్ సినిమాకు ప్రమాదకరం కూడా అవ్వొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ‘తేరి’ కి రీమేక్ గా తెరకెక్కిందా ?, లేదా ఒరిజినల్ స్టోరీ తోనే తీసారా అనేది తేలబోతుంది. మొదట్లో ఈ కాంబినేషన్ లో సినిమాని ప్రకటించినప్పుడు అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. ‘ఓజీ’ చిత్రనికంటే రెండింతలు ఎక్కువ క్రేజ్ ఉండేది. అప్పట్లో ఈ చిత్రం పేరు ‘భవదీయుడు భగత్ సింగ్’.

ఇది ఖుషి చిత్రానికి సీక్వెల్ అని రీసెంట్ గానే హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ‘ఖుషి ‘ లో ఎలా అయితే హీరో , హీరోయిన్ మధ్య ఈగో క్లాష్ లు ఉండేవో , పెళ్ళైన తర్వాత వాళ్ళు ఒక కాలేజీ లో లెక్చరర్స్ గా చేరి, మళ్లీ వాళ్ళ మధ్య ఈగో క్లాష్ లు వస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఒక స్టోరీ రాసానని, కానీ అభిమానులు మా కాంబినేషన్ అంటే కచ్చితంగా మాస్ మసాలా ఎలిమినెంట్స్, ఎలివేషన్ ఫైట్ సన్నివేశాలు ఆశిస్తారు కాబట్టి, ఆ ఆలోచన పక్కన పెట్టేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ స్టోరీ ని రెడీ చేసానని చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. అయితే ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘తేరి’ కి రీమేక్ అంటూ ముహూర్తం జరిగిన రోజు నుండే సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది.

అప్పట్లో దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడలేదు కానీ, ఇప్పుడు మాత్రం ఆయన ఇది రీమేక్ కాదు, నా సొంతంగా రాసుకున్న స్టోరీ, ఒకవేళ రీమేక్ అయితే నేను నేరుగానే ఒప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ అభిమానులు , ప్రేక్షకులు మాత్రం నమ్మడం లేదు. ఇది కచ్చితంగా రీమేక్ , హరీష్ శంకర్ అబద్దాలు చెప్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ నెల 14 న ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు, ట్రైలర్ ని కచ్చితంగా స్టోరీ పరంగానే కట్ చెయ్యాలి. కాబట్టి కచ్చితంగా ఇది తేరి కి రీమేకా ?, కాదా అనే విషయం తేలిపోతుంది. రీమేక్ కాకుండా ఒరిజినల్ స్టోరీ అని తేలితే మాత్రం ఈ సినిమా పై బజ్ మామూలు రేంజ్ లో పెరగదు, ఒక వేళా రీమేక్ అని తేలితే మాత్రం ఉన్న బజ్ కూడా పోతుంది. అంటే మార్చి 14 న తాడో పేడో తేలిపోబోతుంది అన్నమాట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular