Homeఎంటర్టైన్మెంట్Gaurav Khanna prize money issue: 3 నెలలు దాటినా ప్రైజ్ మనీ రాలేదంటూ 'బిగ్...

Gaurav Khanna prize money issue: 3 నెలలు దాటినా ప్రైజ్ మనీ రాలేదంటూ ‘బిగ్ బాస్’ టైటిల్ విన్నర్ ఆవేదన..అసలు ఏమి జరుగుతోంది?

Gaurav Khanna prize money issue: ఇండియా వైడ్ గా ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ లో ఒకటి ‘బిగ్ బాస్’. మన తెలుగు ఆడియన్స్ అయితే ఈ షో కి వేరే లెవెల్ లో కనెక్ట్ అయిపోయారు. ప్రతీ ఏటా ఈ షో కోసం వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఈ షో లో పాల్గొనే కంటెస్టెంట్స్ లో టైటిల్ గెలిచినా వారికి ప్రైజ్ మనీ 50 లక్షలు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు గడుస్తున్నా ప్రైజ్ మనీ పెరగడం లేదు. ప్రైజ్ మనీ పక్కన పెడితే, ఈ షో లో పాల్గొనే ప్రతీ కంటెస్టెంట్ కి వాళ్ళ రేంజ్ కి తగ్గట్టుగా ప్రతీ వారం రెమ్యూనరేషన్ కూడా ఇస్తుంటారు. కొంతమంది టాప్ సెలబ్రిటీలకు ప్రైజ్ మనీ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే ఈ డబ్బులు వాళ్లకు షో నుండి బయటకు వచ్చిన వెంటనే రాదు. చాలా సమయం పడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో ఈ షో టైటిల్ విన్నర్ గా నిల్చిన గౌరవ్ ఖన్నా, రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘ఈ షో నుండి బయటకు వచ్చి 3 నెలలు దాటింది. ఇప్పటి వరకు నా ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్ రాలేదు. న్యాయపరంగా కొన్ని సెటిల్మెంట్స్ జరుగుతున్నాయి. అవి అయ్యాకే డబ్బులు వస్తాయి. ఇలాంటి షోస్ కి ఇలా జరగడం సర్వసాధారణం. డబ్బులు రావడం ఆలస్యం అవ్వోచ్చేమో కానీ, కచ్చితంగా వస్తుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు గౌరవ్ ఖన్నా . అంటే ఇప్పుడు మన తెలుగు బిగ్ బాస్ 9’ టైటిల్ విన్నర్ గా నిల్చిన పవన్ కళ్యాణ్ పడాల కి కూడా ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్ రాలేదా అని ఈ వార్తని చూసిన తర్వాత మన నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇక హిందీ గత బిగ్ బాస్ సీజన్ విషయానికి వస్తే, టైటిల్ విన్నర్ గా గౌరవ్ నిలవగా, మొదటి రన్నరప్ గా ఫర్హానా , రెండవ రన్నరప్ గా ప్రణీత్, మూడవ రన్నరప్ గా తాన్యా , నాల్గవ రన్నరప్ గా అమ్మాళ్ నిలిచారు. ఏ సీజన్ లో లేని విధంగా ఈ సీజన్ లో చాలా వివాదాలు నడిచాయి. విడిపోయిన భయరభర్తలు కూడా ఈ షోలో పాల్గొనడం విశేషం. ఈ సీజన్ పెద్ద హిట్ అవ్వడం తో, ఇప్పుడు ‘బిగ్ బాస్ 20’ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ షో ప్రారంభం కానుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular