Unstoppable: ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో బాలయ్య ఎంత సందడి చేస్తున్నారో తెలిసిందే. ప్రస్తుత కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షోలలో ఒకటిగా ‘అన్‌స్టాపబుల్’ నిలిచింది. తనదైన శైలిలో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఈ షో కు ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, అఖండ టీమ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇటీవలే రాజమౌళి, కీరవాణి కూడా ఈ క్లబ్లో చేరి ప్రేక్షకులను నవ్వులు పూయించారు.
https://twitter.com/ahavideoIN/status/1474388361548742660?s=20
మరోవైపు రవితేజను కూడా గెస్ట్‌గా పిలిపించి.. అందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసి ఆశ్చర్యపరిచారు బాలయ్య.. అయితే, తాజాగా, స్టైలిస్ట్ స్టాల్ అల్లు అర్జున్ను ఈ వేదికపైకి పిలిపించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోలో బన్నీతో పాటు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. తగ్గేదె లే అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ప్రోమోనే ఈ రేంజ్లో ఉంటే.. ఇక ఫుల్ ఎపిసోడ్ పవర్‌ప్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఎపిసోడ్ డిసెంబరు 25న స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే ఈ ఎపిసోడ్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. కాగా, ఈ ఎపిసోడ్లో బన్నీతో పాటు, పుష్ప హీరోయిన్ రష్మిక, సుకుమార్ కూడా హాజరయ్యారు. మరి ఈ షో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.