Homeఎంటర్టైన్మెంట్Uday Kiran Marriage: ఉదయ్ కిరణ్ తో పెళ్లి అనగానే నోటి నుండి మాట రాలేదంటూ...

Uday Kiran Marriage: ఉదయ్ కిరణ్ తో పెళ్లి అనగానే నోటి నుండి మాట రాలేదంటూ సుష్మిత కొణిదెల హాట్ కామెంట్స్!

Uday Kiran Marriage: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్(Uday Kiran), ఆరోజుల్లో ఎంతో మంది స్టార్ హీరోలు కూడా సాధించనంత రికార్డ్స్ ని రాబట్టి సంచలనం సృష్టించాడు. యూత్ ఆడియన్స్ మొత్తం ఆయనకు ఫ్యాన్స్ అయ్యేలా చేసుకున్నాడు. అయితే ఉదయ్ కిరణ్ చిరంజీవి కి వీరాభిమాని, చిరంజీవి కూడా కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందు ఉంటాడు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా ఆరోజుల్లో ఉదయ్ కిరణ్ చిరంజీవి కి అత్యంత సన్నిహితుడు అయ్యాడు. తన జీవితం లో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా, ఆరోజుల్లో ఉదయ్ కిరణ్ చిరంజీవి సలహా తీసుకునేవాడు. అలా గురు శిష్యులుగా వీళ్ళ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఉదయకిరణ్ పద్దతి, అతని అలవాట్లను బాగా నచ్చిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి, తన పెద్ద కూతురు సుష్మిత(Sushmitha Konidela) ని ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.

వెంటనే ఉదయ్ కిరణ్ ని అడగడం, అతను ఓకే చెప్పడం, నిశ్చితార్థం జరగడం వంటివి చక చకా జరిగిపోయాయి. అయితే ఆరోజుల్లో వీళ్లిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో ఉదయ్ కిరణ్, సుష్మిత కొణిదెల మాట్లాడిన మాటలకు సంబంధించిన అప్పటి న్యూస్ పేపర్ కట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా చక్కర్లు కొడుతోంది. ముందుగా విలేఖరి ఉదయ్ కిరణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మొదటిసారి సుష్మిత ని కలిసినప్పుడు మీకు ఏమనిపించింది?’ అని అడగ్గా, దానికి ఉదయ్ కిరణ్ సమాధానం చెప్తూ ‘అంతకుముందు సుష్మిత తో నాకు వ్యక్తిగతంగా పెద్దగా పరిచయం ఏమి లేదు. ఆ కారణం చేత పెళ్లి అనగానే మొదట్లో కాస్త బిడియం కలిగిన మాట వాస్తవమే. అయితే మేమిద్దరం మాట్లాడుకొని , ఇష్టపడిన తర్వాతే పెళ్లి చెయ్యాలనే నిర్ణయం పెద్దవారి సంప్రదాయం నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మొదటిసారి కలిసినప్పుడు పెద్దగా ఏమి మాట్లాడకపోయినా, రెండవ సారి మాత్రం మనసు విప్పి మాట్లాడుకున్నాం. మా ఇద్దరి అభిప్రాయాలూ , అభిరుచులు కలిసాయి’ అంటూ చెప్పుకొచ్చాడు ఉదయ్ కిరణ్.

అదే విధంగా రిపోర్టర్స్ సుష్మిత ని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ఒకటి ‘ఈ వివాహ ప్రస్తావన వినగానే మీకు ఏమనిపించింది?’ అని రిపోర్టర్ అడగ్గా, అందుకు సుష్మిత సమాధానం చెప్తూ ‘లండన్ లో ఫ్యాషన్ టెక్నాలజీ చేస్తున్న నాకు, ఇప్పట్లో పెళ్లి ఆలోచన కానీ, ఊహ కానీ లేవు. మా అమ్మ లండన్ కి వచ్చి , ఈ విషయం చెప్పగానే ఒక్కసారిగా షాక్ కి గురయ్యాను. చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లోనూ నా బాగోగులు చూసిన తల్లిదండ్రులు, నా లైఫ్ పార్టనర్ ని ఎంపిక చేయడం లో పొరపాటు చేయరని భావించాను . పైగా ఇంట్లో ప్రతీ ఒక్కరు ఈ సంబంధాన్ని ఇష్టపడడం తో నేను కూడా ఓకే చెప్పేసాను. అయినప్పటికీ వ్యక్తిగతం గా ఉదయ్ కిరణ్ తో మాట్లాడిన తర్వాతే నా అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నాను’ అంటూ అప్పట్లో చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన పేపర్ కట్ ని మీరు క్రింద చూడవచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular