India vs South Africa T20 World Cup Super 8: క్రికెట్లో రెండు జట్ల మధ్య పోటీ ఉంటుంది. ఒకవేళ ఆ రెండు జట్లు బలమైనవి అయితే పోటీ తీవ్రంగా ఉంటుంది.. కొన్ని సందర్భాలలో రెండు జట్లు హోరాహోరీగా పోరాడితే.. విజయం దోబూచులాట ఆడుతుంది. చివరికి ఏదో ఒక జట్టును విజయం వరిస్తుంది. కొన్ని సందర్భాలలో రెండు జట్ల ప్రదర్శన సమంగా ఉన్నప్పుడు.. సూపర్ ఓవర్ కు దారి తీస్తుంది.
రెండు జట్ల ఆటగాళ్లు పోటీ పడుతున్నప్పుడు అభిమానులలో ఉత్కంఠ ఉంటుంది.. ఎవరు గెలుస్తారు? ఎవరు ఎక్కువ పరుగులు తీస్తారు? ఎవరు ఎక్కువ వికెట్లను పడగొడతారు? క్యాచ్ లు పట్టే విధానంలో ఎవరు నేర్పరితనాన్ని ప్రదర్శిస్తారు? ఇలా రకరకాల ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతాయి.
ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో పై ఉపోద్ఘాతం మాదిరిగా మ్యాచ్ లు సాగుతున్నాయి. అది ఒక మాతృమూర్తికి మాత్రం ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో జరగబోయే ఒక మ్యాచ్ పరీక్షగా మారింది.. టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8 దశలో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఫిబ్రవరి 22న మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే ఒక మహిళకు మాత్రం ఈ మ్యాచ్ కఠినమైన పరీక్షలాగా మారింది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన విషయం ఉంది..
టీమిండియా కు ప్రస్తుతం బౌలింగ్ కోచ్ గా మోర్ని మోర్కెల్ వ్యవహరిస్తున్నాడు.. అతని ఆధ్వర్యంలో టీమిండియా బౌలింగ్ చాలా వరకు మెరుగుపడింది. మోర్కెల్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా బౌలర్లు టి20 ఫార్మాట్ లో సంచలనం సృష్టిస్తున్నారు.. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో కూడా అద్భుతాలు నమోదు చేస్తున్నారు..
మోర్కెల్ ది దక్షిణాఫ్రికా దేశం. ఇతడు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు చాలా సంవత్సరాల పాటు ఆడాడు. ఇక అదే దక్షిణాఫ్రికా జట్టుకు ఆల్బి మోర్కెల్ స్పెషలిస్ట్ కోచింగ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. అల్బి మోర్కెల్, మోర్ని మోర్కెల్ ఇద్దరూ అన్నదమ్ములు. 21న జరిగే సూపర్ 8 పోరు లో టీమిండియా, దక్షిణాఫ్రికా పోటీ పడుతున్నాయి. ఈ పోటీ ఆ రెండు జట్ల కంటే మోర్ని మోర్కెల్, అల్బి మోర్కెల్ మధ్యే కేంద్రీకృతమై ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తన ఇద్దరు కుమారులు దక్షిణాఫ్రికా జాతీయ జట్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం కలిగి ఉండడంతో.. ఎవరికి మద్దతు తెలపాలో తెలియని సందిగ్ధమైన స్థితి నెలకొందని మోర్కెల్ సోదరుల మాతృమూర్తి చెబుతోంది.. దక్షిణాఫ్రికా జట్టు, భారత జట్టు తలపడే సూపర్ 8 మ్యాచ్ ఈమెకు ఒక రకమైన సందిగ్ధమైన స్థితిని తీసుకొచ్చింది..
“మా తల్లి చాలా కంగారుపడుతోంది. మా కంటే ఎక్కువ ఆమెలో ఒత్తిడి ఉంది. ఎవరికి అండగా నిలవాలో తెలియని పరిస్థితి ఆమెది. ఇండియాకు సపోర్ట్ చేయాలా, దక్షిణాఫ్రికా సపోర్ట్ చేయాలా తెలియని స్థితిలో ఆమె ఉందని” అల్బి మోర్కెల్ చెబుతున్నాడు.