Homeఎంటర్టైన్మెంట్Balachander: చిరంజీవి తో ఎవ్వరు పోటీ పడలేరు... ఎందుకంటే : బాల చందర్...

Balachander: చిరంజీవి తో ఎవ్వరు పోటీ పడలేరు… ఎందుకంటే : బాల చందర్…

Balachander: తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని అలరిస్తూ వచ్చాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా చిరంజీవి సినిమాకి ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు వేరే రేంజ్ అనే చెప్పాలి. ఆయన లాంటి హీరో ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఒక సినిమాకి కమిట్ అయిన తర్వాత ఆయన […]

Balachander: తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుడిని అలరిస్తూ వచ్చాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా చిరంజీవి సినిమాకి ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు వేరే రేంజ్ అనే చెప్పాలి. ఆయన లాంటి హీరో ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఒక సినిమాకి కమిట్ అయిన తర్వాత ఆయన ఏ రేంజ్ లో కష్టపడతాడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తాడు. ఆ సినిమాలో పైవిద్యాన్ని చూపించడానికి ఎంతటి రిస్క్ అయిన చేస్తుంటాడు… అలాంటి చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్రనైతే వేశాడు. ఇక తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన బాలచందర్ సైతం చిరంజీవితో రుద్రవీణ అనే సినిమా చేశాడు. ఈ సినిమా సమయంలోనే చిరంజీవి నట పొటెన్షియాలిటీని తెలుసుకున్న బాలచందర్ చిరంజీవిలో అత్యుత్తమమైన నటుడు ఉన్నాడని అతన్ని దర్శకులు కమర్షియల్ సినిమాలకే వాడుతున్నారు. ఆర్ట్ సినిమాలకు ఎవరు వాడుకోవడం లేదు అంటూ ఒక ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. చిరంజీవి అంటే మామూలు వ్యక్తి కాదు.

ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ ని కలిపితే చిరంజీవి అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశాడు. మొత్తానికైతే బాలచందర్ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని ఆ తర్వాత పలు సందర్భాల్లో కొంతమంది దర్శకులు కూడా క్లారిటి ఇచ్చారు. చిరంజీవి డాన్సులు చేస, మంచి నటన ను కనబరుస్తూ ఉంటాడు.

అందువల్లే చిరంజీవికి ఆ గుర్తింపు వచ్చిందని చెబుతుంటారు. ఇక ఘరానా మొగుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవిని ఉద్దేశించి ఒక మ్యాగజైన్ వాళ్లు ‘బిగ్గర్ దేన్ బచ్చన్ ‘ అంటూ వాళ్ళ మ్యాగజైన లో ఫోటో వేశారు. ఆ విషయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబచ్చన్ టాప్ పొజిషన్లో ఉన్నప్పటికి అతని కంటే చిరంజీవి ఇంకా పెద్ద నటుడు అని ఆ మ్యాగజైన్ లో రావడం అతని స్థాయి ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది… ఇక చిరంజీవి ఇప్పటికి వరుస సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు అంటే సినిమాల మీద అతనికి ఉన్న ఆసక్తి ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper