Vijay Deverakonda: అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ తనను టాప్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. గత కొద్ది రోజుల నుంచి ఆయన చేస్తున్న సినిమాలో విషయంలో చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఫలితంగా వచ్చిన సినిమా వచ్చినట్టు డిజాస్టర్ ని మూటగట్టుకుంటున్నాయి. గత సంవత్సరం ఆయన చేసిన ‘కింగ్ డమ్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడు. ఇక ఎప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది…రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఆయన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…
రాహుల్ సాంకృత్యాయన్ సినిమాలో మరో సినిమా చేస్తున్నాడు. మొత్తానికైతే విజయ్ దేవరకొండ మీద భారీ బడ్జెట్ పెట్టి ప్రొడ్యూసర్లు సినిమాలు చేస్తుండడం విశేషం…విజయ్ దేవరకొండ ‘గీతా గోవిందం’ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఆ సినిమా తర్వాత నుంచి ఆయన చేసిన ఏ సినిమాకి 100 కోట్లు కలెక్షన్స్ రాలేదు.
ఇక ఎందుకని ప్రొడ్యూసర్లు అతని సినిమాల మీద దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారనే విషయం ఎవరికి అర్థం కావడం లేదు. విజయ్ దేవరకొండ సినిమా సూపర్ సక్సెస్ అయిన కూడా 150 కోట్ల కలెక్షన్స్ రావడం అనేది చాలా వరకు కష్టమనే చెప్పాలి…
ఈ హీరో మీద ప్రొడ్యూసర్స్ వల్ల మార్కెట్ కు మించి ఏ ధైర్యంతో బడ్జెట్ కేటాయిస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…ఇక ఏది ఏమైనా కూడా విజయ్ తో చేస్తున్న సినిమాల విషయంలో ప్రొడ్యూసర్లు చాలా కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరమైతే ఉంది. ఏమాత్రం తేడా జరిగిన కూడా వాళ్ళు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు…