Ravi Teja: ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ సోలోగా తనకంటూ ఒక స్థాయిని ఏర్పాటు చేసుకున్న హీరో రవితేజ…చిరంజీవి ఎలాంటి కష్టాలను పడి ఇండస్ట్రీకి వచ్చాడో అలాగే రవితేజ కూడా చిరంజీవి ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీకి వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన కెరీయర్ని చక్కబెట్టడంలో కృష్ణవంశీ, పూరి జగన్నాద్ లాంటి దర్శకులు కీలకపాత్ర వహించారు.
రవితేజ పూరి డైరెక్షన్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి అనే మూడు వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత రవితేజతో ఒక దర్శకుడు సినిమాలు చేస్తానని చెప్పి ఆయన డేట్స్ కూడా తీసుకున్న తర్వాత సినిమా చేయకుండా క్యాన్సిల్ చేశారట. ఆ దర్శకుడు ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్…
ఇక త్రివిక్రమ్ మొదట నువ్వే నువ్వే అనే సినిమా చేశారు. ఈ సినిమా కమర్షియల్ గా అంత బాగా వర్కౌట్ కాలేదు. ఇక తర్వాత రవితేజతో ఒక సినిమా చేయాలనుకున్నప్పటికీ అది అనుకోని కారణాల వల్ల వీలు అవ్వలేదు. అందువల్లే ఆయన ఆ తర్వాత అతడు సినిమా చేసి మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇక ఆరకంగా త్రివిక్రమ్ రవితేజ కి హ్యాండ్ ఇచ్చారనే చెప్పాలి…
ఇప్పుడు ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమారు కూడా రవితేజ కి మొదట్లో హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆర్య తర్వాత జగడం సినిమా చేశాడు.. ఇక జగడం, ఆర్య 2 మధ్యలో ఇక వీళ్ళ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులను కూడా పూర్తి చేశారు. కానీ ఏమైందో తెలియదు మధ్యలో ఆర్య 2 సినిమా మీదికి వెళ్లిపోయాడు ఇలా ఇద్దరు స్టార్ డైరెక్టర్లు. ఆయనకి పెద్ద హ్యాండ్ ఇచ్చారనే చెప్పాలి. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read More