spot_img
Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan- Ram Charan: చరణ్ దగ్గర అప్పు చేసి తీర్చలేకపోయిన పవన్... ఎంత ఇవ్వాలో...

Pawan Kalyan- Ram Charan: చరణ్ దగ్గర అప్పు చేసి తీర్చలేకపోయిన పవన్… ఎంత ఇవ్వాలో తెలిస్తే షాక్ అవుతారు!

Pawan Kalyan- Ram Charan: సినిమాకు యాభై కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ అబ్బాయి రామ్ చరణ్ వద్ద అప్పు చేశాడంటే మీరు నమ్ముతారా?… కానీ ఇది నిజం. పవన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఒకప్పుడు రామ్ చరణ్ వద్ద డబ్బులు అడిగి తీసుకునేవాడినని గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ స్వయంగా తెలియజేశారు. 2007లో చిరుత మూవీ ద్వారా రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ… పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర విషయం బయటపెట్టారు.

Pawan Kalyan- Ram Charan
Pawan Kalyan- Ram Charan

ఖుషి సినిమా వరకు కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. వదినను అడగాలంటే సిగ్గేసేది. సినిమాలు చేస్తున్నావ్, హీరో అయ్యావ్ ఇంకా డబ్భులు అడుగుతున్నాడేంటి అనుకుంటుందేమో అనిపించేది. అప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. రామ్ చరణ్ దగ్గర డబ్బులు ఎలా ఉండేవో తెలియదు కానీ బాగా ఉండేవి. ఇక చరణ్ దగ్గర అప్పు చేసేవాడిని. చరణ్ కి ఎలా ఖర్చుపెట్టాలో తెలియదు. దాని వలన ఎప్పుడూ డబ్బులు ఉండేవి. నాకు చాలా సినిమాలు వస్తాయి. నీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను అని చెప్పేవాడిని. చరణ్ దగ్గర డబ్బులు తీసుకోవడానికి నేను ఫీల్ అయ్యేవాడిని కాను. ఇప్పటికీ ఆ డబ్బులు చరణ్ కి తిరిగి ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

Also Read: E.D- MLC Kavitha: ఈడీ పెను సంచలనం: వైసీపీ ఎంపీ, ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ ఇంట్లో సోదాలు?

నేను పేరెంట్స్ ఇచ్చిన ప్యాకెట్ మనీ వంద రెండొందలు దాచుకునే వాడిని. ఆ డబ్బులు ఖర్చు పెట్టేవాడిని కాదు. బాబాయ్ కి ఇస్తే వడ్డీతో కలిపి ఇస్తాడని ఆలోచించేవాడినని అదే ఇంటర్వ్యూలో పవన్ పక్కన కూర్చున్న రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. వీరిద్దరి మాటలు వింటున్న చిరంజీవి సరదాగా ఎంజాయ్ చేస్తూ… నవ్వుకున్నారు. అంటే అప్పట్లో పవన్ చరణ్ వద్ద వందా రెండొందలు అప్పు చేసేవాడన్న మాట. దాదాపు పదిహేనేళ్ల నాటి ఈ ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. హీరో కాక ముందే బాబాయ్ కి అప్పు ఇచ్చిన చరణ్ మామూలోడు కాదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

Pawan Kalyan- Ram Charan
Pawan Kalyan- Ram Charan

పవన్ కళ్యాణ్ ఎంత మొహమాటస్తుడో చెప్పడానికి తాజా ఉదంతమే నిదర్శనం. ఇక చిన్నప్పటి నుండి రామ్ చరణ్ కి పవన్ అంటే వల్లమాలిన అభిమానం ఉందని చెప్పొచ్చు. చరణ్ స్టార్ గా ఎదిగాక కూడా ఆ ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదు. బాబాయి పవన్ ని ఎవరైనా పల్లెత్తి మాట్లాడితే చరణ్ ఫైర్ అవుతారు. గతంలో పవన్ ని కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళకు రామ్ చరణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. పవన్ జనసేన పార్టీకి చరణ్ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఆయన ప్రచారం చేసే ఆస్కారం ఉంది. ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ కి పండగే.

Also Read:Balakrishna Rejected Movies: బాలయ్య వద్దనుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper