Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan gifts car: డైరెక్టర్ సుజిత్ కి ఖరీదైన కారు ని బహుకరించిన పవన్...

Pawan Kalyan gifts car: డైరెక్టర్ సుజిత్ కి ఖరీదైన కారు ని బహుకరించిన పవన్ కళ్యాణ్..వైరల్ అవుతున్న ట్వీట్!

Pawan Kalyan gifts car: ఒకప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఒక ఎమోషన్. ఎందుకంటే వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకుంటున్న సమయంలో ఆయన నుండి వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఓజీ'(They Call Him OG) సినిమా అలాంటిది. సుజిత్ దర్శకత్వం లో ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక అక్కడి నుండి ఈ సినిమాపై క్రేజ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. విడుదలకు ముందు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాపై అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయి అని చెప్పడానికి.

అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కాంతారా 2 లాంటి సినిమా పోటీకి వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకు 316 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది. ఓటీటీ లో కూడా ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా డైరెక్టర్ సుజిత్ పని తీరు పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చింది. పని చేస్తే ఇలాంటి డైరెక్టర్స్ తోనే పని చెయ్యాలి అని ఆయన సక్సెస్ మీట్ లో కూడా చెప్పుకొచ్చాడు. అయితే నేడు తనకు ఓజీ లాంటి సినిమా ని అందించినందుకు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కి ఖరీదైన కారుని బహుమతిగా అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సుజిత్ సోషల్ మీడియా లో షేర్ చేసి ఎంతో మురిసిపోయాడు.

ఆయన మాట్లాడుతూ ‘నా జీవితం లో ఇప్పటి వరకు వచ్చిన ది బెస్ట్ బహుమతి ఇదే. నా నోటి నుండి నేడు మాటలు రావడం లేదు. నా ఓజీ కళ్యాణ్ గారి నుండి ఇంత ప్రేమ , ఆప్యాయత ని సొంతం చేసుకోవడం నా అదృష్టం. చిన్నతనం నుండి ఆయన వీరాభిమాని గా పెరిగిన నాకు ఇది ఎంతో స్పెషల్ స్పెషల్ మూమెంట్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ సుజిత్. ఈ పోస్టు క్రింద అభిమానులు సాధ్యమైనంత తొందరగా ఓజీ 2 , ఓజీ 3 చిత్రాలను ప్రారంభించామని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలను ఒకేసారి తీస్తానని, వచ్చే ఏడాది చివర్లో మొదలు పెడతాను అని, ఇప్పటికే సుజిత్ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper