Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డివంగ…ఆ తర్వాత కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న స్పిరిట్ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును తెచ్చుకోవాలని చూస్తున్నాడు. నిజానికి సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో నటించాలంటే ఘట్స్ ఉండాలి. ఎలాంటి సీన్స్ లో నైనా నటించగలిగే కెపాసిటీ ఉండాలి. అలాంటప్పుడే ఆయన వాళ్లతో సినిమాలను చేస్తాడు… ఇక అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ చాలా బోల్ట్ గా నటించాడు. దానిని రీమేక్ చేస్తూ బాలీవుడ్ లో చేసిన కబీర్ సింగ్ సినిమాలో షాహిద్ కపూర్ కూడా అలాంటి క్యారెక్టర్ నే పోషించాడు. అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ నటించాడు. అలాంటి బోల్డ్ సన్నివేశాలను సీన్స్ ని క్రియేట్ చేయడంలో సందీప్ రెడ్డివంగ దిట్ట…కాబట్టి అతనితో నటించాలంటే గుండెలో గట్స్ ఉండాలి అంటూ చాలామంది సందీప్ అభిమానులు సైతం కొంతమంది హీరోలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.
అన్ని రకాలుగా నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికి ఆయన మాత్రం వాళ్ళని పట్టించుకోవడం లేదు. తెలుగు హీరోలకే తను పెద్దపీట వేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ను హీరోగా పెట్టి చేస్తున్న స్పిరిట్ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తోంది అనేది తెలియాల్సి ఉంది…
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ కూడా ఒకరు కావడం విశేషం… ఆయన సినిమాలను తొక్కేయాలనే ప్రయత్నం చేసినప్పటికి అతను ఎవ్వరికి భయపడకుండా తన సినిమాలను తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బాలీవుడ్ మాఫియాకు సైతం చుక్కలు చూపించిన దర్శకులలో సందీప్ రెడ్డివంగ ఒకరు…
బాలీవుడ్ హీరోలు అతనితో సినిమా చేయడానికి ఏదో ఒక రకంగా తనని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసిన అది వర్కౌట్ కావడం లేదు. కాబట్టి సందీప్ ను ఢీ కొట్టడం అనేది అసాధ్యం…తనని రిక్వెస్ట్ చేసుకొని అతనితో సినిమా చేసుకుంటే మంచిదని పలువురు సినిమా మేధావులు బాలీవుడ్ హీరోలకు సలహాలను ఇస్తున్నారు…