Sandeep Reddy Vanga vs Bollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తూ భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) లాంటి దర్శకుడు చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక కాంట్రవర్సీ అయితే క్రియేట్ అవుతోంది. మరి ఇది కావాలనే కొంతమంది చేస్తున్నారా లేదంటే ఆయన సినిమాలే కాంట్రవర్సీ లాగా మారుతున్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఇక అనిమల్ (Animal) సినిమా విషయంలో బాలీవుడ్ మాఫియా మొత్తం అతని మీద పెద్ద ఎత్తున కాంట్రవర్సీ ని అయితే క్రియేట్ చేశారు. అయినప్పటికి సందీప్ రెడ్డివంగా ఎవ్వరికి తగ్గదే లేదు అన్నట్టుగా తన వైఖరితో సినిమాని ముందుకు తీసుకెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపాడు. ఇక ఇప్పటికే దీపిక పదుకొనే (Deepika Padukone) విషయంలో కూడా ఒక చిన్న కాంట్రవర్సీ జరిగిన విషయం మనకు తెలిసిందే.
స్పిరిట్ (Spirit) సినిమాలో ఆమెను కాదని త్రిప్తి డిమ్రి (Tripti Dimri) ని హీరోయిన్ గా తీసుకోవడం వల్ల ఆమె హర్ట్ అయ్యి సినిమాకు సంబంధించిన కథ మొత్తాన్ని లీక్ చేసింది. దాని మీద సందీప్ వంగ ఒక ట్వీట్ అయితే చేశాడు. మరి ఏది ఏమైనా కూడా సందీప్ ప్రస్తుతం సక్సెస్ లో ఉన్నాడు కాబట్టి అతనికి ఏమీ తెలియడం లేదు.
ఒకవేళ ఫ్లాప్ వస్తే మాత్రం బాలీవుడ్ మాఫియా అతనితో ఆడుకోవడానికి కసరత్తులు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అతనికి సినిమాలు చేయడం రాదని బోల్డ్ సినిమాలు చేస్తూ సక్సెస్ లను సాధిస్తాడు అంటూ ఆయన మీద దుష్ప్రచారాలు చేయడానికి కూడా వాళ్ళు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయినప్పటికి సందీప్ మాత్రం ఒక్కడే సింగిల్ హ్యాండ్ తో వాళ్లందరిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు.
Also Read: Sandeep Reddy Vanga : స్పిరిట్ సినిమా మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న బాలీవుడ్ మాఫియా…
మరి ప్లాప్ ల్లో ఉన్నప్పుడు కూడా ఇదే గట్స్ తో తనని తాను మ్యానేజ్ చేసుకోగలుగుతాడా లేదా అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. నిజానికి సందీప్ చేసే సినిమాలు ప్లాప్ అయితే అవ్వవు…ఆయన ఈ జనరేషన్ ప్రేక్షకులకు తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి…ఇక మీదట కూడా ఆయన చేయబోయే సినిమాలు మంచి సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీని తారా స్థాయి కి తీసుకెళ్లాలని మనందరం కోరుకుందాం…