Paruchuri Brothers about Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని స్టార్ హీరోగా నిలబెట్టడమే కాకుండా దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటు ముందుకు సాగుతున్నాడు. ఇక 70 సంవత్సరాల వయసులో కూడా ఇప్పుడున్న యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. మరి చిరంజీవి లాంటి నటుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో కొంతవరకు డీలా పడ్డట్టుగా అనిపిస్తున్నప్పటికి ఇప్పుడు రాబోయే సినిమాలతో బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో సినిమాల్లో చాలా బిజీగా ఉండడంవల్ల మాల వేసుకున్న రామ్ చరణ్ ను శబరిమలైకి ఎవరితో పంపించాలి అని అనుకున్నప్పుడు పరుచూరి బ్రదర్స్ మాల వేసుకున్నారని తెలిసి వాళ్ళదగ్గరికి వెళ్ళి రామ్ చరణ్ ని సేఫ్ గా శబరిమలై తీసుకొని వెళ్లి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను తమకి అప్పజెప్పాడంట. దాంతో చిరంజీవి కొడుకు అనే విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించద్దని ఎవరికి తెలియకూడదని చెప్పారట. దాంతో పరుచూరి బ్రదర్స్ రామ్ చరణ్ ను తీసుకుని శబరిమలైకి బయలుదేరారట. ఇక మధ్య మధ్యలో వీళ్లు ట్రైన్స్ ని చేంజ్ అవుతూ అలాగే అక్కడి నుంచి కొంత దూరం కారులో వెళ్లడం లాంటివి చేశారట…
అప్పుడు రామ్ చరణ్ వీళ్ళతో ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చొని ఉండేవాడట. ట్రైన్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉండేవాడట…పరుచూరి బ్రదర్స్ భోజనం చేస్తుంటే వాళ్ళు రామ్ చరణ్ ను తింటావా అని అడిగేదాకా ఏం చెప్పేవాడు కాదట…
Also Read: ‘థామా’ మూవీ టీజర్ రివ్యూ: భయపెడుతున్న రష్మిక.. ఈ యాంగిల్ చూడలేదు…
శబరి మలై లో పైకి నడుస్తూ రాగలవా అని అడగడంతో రాంచరణ్ ఓకే నడుస్తానని చెప్పాడట. రామ్ చరణ్ కూడా అంత చిన్న ఏజ్ లో చాలా హంబుల్ గా ఉండేవాడని ఎక్కడ కూడా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి అనే ఒక గర్వాన్ని చూపించకపోయేవాడట. నార్మల్ పర్సన్ ఎలా ఉంటాడో అలా ఉండేవాడట…
పరుచూరి బ్రదర్స్ మనం చరణ్ ను ఏదైనా ఇబ్బంది పెడుతున్నామా అనే డౌట్ అయితే వచ్చేదట. అప్పటికి రామ్ చరణ్ మాత్రం చాలా నవ్వుతూ దేవుడిని దర్శనం చేసుకొని తిరిగి వాళ్లతో పాటు ఇంటికి వచ్చారట… ఇక మొత్తానికైతే మెగాస్టార్ కొడుకు ఇంత సింపుల్ గా ఉంటాడని మేము అసలు అనుకోలేదు అంటూ పరుచూరి వాళ్ళు గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…