Tollywood Star Hero: సక్సెస్ కిక్ ఎక్కడ దిగుతుందోనని ఆ స్టార్ హీరో అదే పనిగా ఆల్కహాల్ సేవిస్తున్నాడట. ఇక తాను చెడిపోయేది కాక పార్టీల పేరుతో రోజూ ఓ పది మందికి మందు, విందు ఏర్పాటు చేస్తున్నాడట. టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ స్టార్ హీరో వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కాగా సదరు టాప్ స్టార్ ఇటీవలే ఓ భారీ హిట్ కొట్టాడు. త్వరలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ గ్యాప్ లో ఆనందమే పరమావధిగా బ్రతికేస్తున్నాడట. డైలీ తన నివాసంలో మందు పార్టీలు నిర్వహిస్తున్నాడట.

ఫుల్ గా మందు కొట్టి తన ఇన్నర్ ఫీలింగ్స్, ఫ్రస్ట్రేషన్స్ చుట్టూ ఉన్న సన్నిహితులతో షేర్ చేస్తున్నాడట. మన హీరో మందు తాగే మోతాదు చూసి ఫ్రెండ్స్ బాధపడుతున్నారట. ఇలా తాగితే ఫిజిక్, హెల్త్ పాడవుతాయని మంచి బోధిస్తున్నారట. అయినా ఈ హీరోకి అవేమీ అసలు పట్టడం లేదట. రోజూ మందు తాగి మత్తులో తూగుతున్నాడట. ఈ హీరో ఆ స్థాయిలో ముందుకు బానిస కావడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తుందట.
Also Read: Poonam Pandey: పూనమ్ పాండేపై ఎందుకు చార్జీషీటు దాఖలు చేశారు?
గతంలో చాలా మంది నటులు ఈ వ్యసనానికి బలయ్యారు. అతిగా మందు తాగి కేరీర్ కోల్పోయిన నటులు ఉన్నారు. కొందరైతే తక్కువ ప్రాయంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ అలవాటు కారణంగా ఆర్థికంగా చితికిపోయిన తారలు కూడా లేకపోలేదు. చుట్టూ ఇన్ని ఉదాహరణలు ఉన్నా సదరు స్టార్ హీరో మాత్రం అవగాహన చేసుకోవడం లేదట. పూటుగా మందు తాగి ఎంజాయ్ చేస్తున్నాడట .

ఈ జనరేషన్ హీరోల్లో కూడా కొందరు ఆల్కహాలిక్స్ ఉన్నారు. అతిగా మందు తాగి గ్లామర్ కోల్పోతున్నారు. ఆ స్టార్స్ ఒకప్పటి గ్లామర్ కి ఇప్పటి గ్లామర్ కి పొంతన లేకుండా పోయింది. తక్కువ వయసులోనే ముసలితనం వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు నాగార్జున లాంటి హీరోలను స్ఫూర్తిగా తీసుకోవాలి. 60 ఏళ్ళు దాటినా ఆయన యంగ్ అండ్ ఫిట్ గా కనిపించడానికి కారణం దురలవాట్లకు దూరంగా ఉండటంతో పాటు మంచి ఆహారం తీసుకోవడం.
Also Read:Pawan Kalyan- Sai Dharam Tej: పవన్ రాక కోసం ధరమ్ ఎదురుచూపులు!
Recomended Videos
[…] […]