Tollywood music directors trend: ఒక సినిమా సక్సెస్ లో కథ ఎంత ముఖ్యమో దానిని విజువల్ గా స్క్రీన్ మీద చూపించడం కూడా అంతే ముఖ్యం…ఇక వీటితో పాటుగా ఒక మూవీ లో సక్సెస్ లో మ్యూజిక్ కూడా కీలకపాత్ర వహిస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే… సినిమాలోని పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నప్పుడే సినిమాకి హై ఎలివేషన్స్ దొరుకుతాయి. ఇక ప్రేక్షకుడు థియేటర్ కి రావాలి అంటే ముందుగా ఆ సినిమాలోని పాటలు అతనికి నచ్చాలి. కనీసం దానివల్ల ప్రేక్షకులలో ఒక హైప్ క్రియేట్ అయి సినిమాని చూడాలనే ఉత్సాహం కలుగుతుంది… ఇక అందుకే మన దర్శకులు ప్రస్తుతం కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వైపు అడుగులు వేస్తున్నారు. సుకుమార్ లాంటి దర్శకుడు సైతం తన మొదటి సినిమా నుంచి చివరగా చేసిన ‘పుష్ప 2’ సినిమా వరకు దేవిశ్రీప్రసాద్ నే తన ఆస్థాన సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు.
ఇక అలాంటి సుకుమార్ సైతం ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా కోసం అనిమల్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన హర్షవర్ధన్ రామేశ్వర్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తనతో పాటు దురందర్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న శుశ్వత్ సత్యదేవ్ లను కలిశాడట. ఈ మూవీలో ఎవర్నో ఒకరిని తీసుకోవాలని చూస్తున్నాడు.
దేవి శ్రీ ప్రసాద్ ను ఎందుకు పక్కన పెట్టాడని కొంతమంది సుకుమార్ మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు సుకుమార్ సాధించిన సక్సెస్ లలో దేవిశ్రీప్రసాద్ పాత్ర చాలా కీలకమైందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ఆ విషయం సుకుమార్ కి కూడా తెలుసు కానీ ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ హీరోగా మారాడు. కాబట్టి తనకు మ్యూజిక్ చేసే అంత టైం దొరకడం లేదనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ వీళ్లిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట…
అనిల్ రావిపూడి లాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ సైతం గత రెండు సినిమాల కోసం భీమ్స్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నప్పటికి ఇప్పుడు వెంకటేష్ కళ్యాణ్ రామ్ లతో చేస్తున్న సినిమా కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. మరి ఆయన కూడా హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు అడుగులు వేస్తున్నాడనే వార్తలైతే వస్తున్నాయి… చూడాలి మరి రాబోయే రోజుల్లో మన దర్శకులు ఒక క్వాలిటీ సినిమాని ప్రేక్షకుడికి అందించడానికి ఎలాంటి ఎక్స్పరిమెంట్లు చేస్తారు. సినిమాల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…