Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ సోమవారం రోజున జరిగే నామినేషన్స్ ప్రక్రియ ఎంత హీట్ వాతావరణం లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వారం కూడా నామినేషన్స్ అదే హీట్ వాతావరణం లో జరిగాయి , అదే సమయం లో కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఈ నామినేషన్స్ ప్రక్రియ రోహిత్ , త్రిగున్ మధ్యనే నడుస్తూ ఉంటాయి. వీళ్లిద్దరి పేర్లు ఎత్తకుండా కంటెస్టెంట్స్ నామినేషన్స్ చెయ్యలేరు. అలాంటి బ్రాండ్ ని సంపాదించుకున్నారు. అయితే ప్రతీ నామినేషన్స్ నోరు జారే త్రిగున్, నిన్నటి నామినేషన్ లో మాత్రం కామెడీ చేశాడు. ఆయన చేసిన కామెడీ కి హౌస్ మేట్స్ అందరూ పగలబడి నవ్వారు. ఒకపక్క గొడవలు పెడుతూ తమాషా చూసే త్రిగున్, మరో పక్క కంటెస్టెంట్స్ అందరితో కలిసి కామెడీ చేయడం వంటివి కూడా తరచూ చేస్తుంటాడు.
పూర్తి వివరాల్లోకి నిన్న రామకృష్ణ ఝాన్సీ ని నామినేట్ చేసాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాదనల్లో రామకృష్ణ షాలిని కాళ్ళు పట్టుకున్న మ్యాటర్ బయటకు వచ్చింది. నువ్వు కావాలనే చిన్న విషయానికి ఆమె కాళ్ళు పట్టుకొని సానుభూతి పొందాలని చూసావు అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ. దీనిపై ఆమె త్రిగున్ ని ఉదాహరణగా చూపిస్తూ , ఈ హౌస్ లో త్రిగున్ అన్న ఎంతో మందిని బాధపెట్టాడు , ఆయన చేసినన్ని తప్పులు ఎవ్వరూ చేయలేదు , అయినప్పటికీ ఆయన ఎవరి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పలేదు , అలాంటిది నువ్వు ఎందుకు చెప్పావ్ అంటూ రామకృష్ణ ని అడుగుతుంది ఝాన్సీ. అందుకు త్రిగున్ కూడా చాలా ఫన్నీ గా సమాధానం ఇస్తాడు. ‘నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా ‘ అంటూ ఫన్నీ గా ఒక పాట పాడుతాడు. నామినేషన్స్ మొదటి రోజు చాలా హీట్ గా నడిచింది కానీ , రెండవ రోజు మాత్రం చాలా ఫన్నీ గా సాగిపోయింది.