Cm Chandrababu Naidu: రాజకీయ పార్టీ అంటే కేవలం ఒక వ్యక్తి కి సంబంధించినది కాదు , వందల మంది నాయకులకు సంబంధించినది , లక్షలాది మంది కార్యకర్తలకు సంబంధించినది. వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇచ్చిన రోజే పార్టీ గెలుస్తుంది , జనాల్లోకి బలంగా దూసుకెళ్తుంది, అధికారం లోకి వస్తుంది. వైసీపీ పార్టీ లో నాయకత్వం ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఆ పార్టీ లోని నాయకుల సలహాలకు జగన్ ఎలాంటి విలువ ఇవ్వడు. తనకు ఏది తోచితే అది చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. కానీ చంద్రబాబు , లోకేష్ అలా కాదు , రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకుల మాట విని , కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి, దానికి తగ్గట్టుగా అభ్యర్థులను ప్రకటించి బీ ఫార్మ్స్ అందించారు. లిస్టు ని పరిశీలించి చూస్తే గెలుపు గుర్రాలని బరిలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది.
అంతే కాదు మిత్రపక్షాలకు కూడా సరైన గౌరవం ఇస్తూ తెలుగు దేశం పార్టీ ముందుకెళ్తోంది. కూటమి లో ఉన్నటువంటి జనసేన , బీజేపీ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ , ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా ఉందంటే అందుకు కారణం చంద్రబాబు మాత్రమే. జనసేన పోటీ చేసే అనేక స్థానాల్లో టీడీపీ పార్టీ సభ్యులు , అదే విధంగా టీడీపీ పార్టీ పోటీ చేసే అనేక స్థానాల్లో జనసేన సభ్యులు నామినేషన్స్ వేశారు. అయితే చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. మిత్ర ధర్మం పాటించకుండా, జనసేన అభ్యర్థులకు పోటీ గా రెబల్ అభ్యర్థులు నామినేషన్స్ వేస్తే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని , పార్టీ నుండి సస్పెండ్ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో నామినేషన్స్ వేసినవాళ్లంతా నేడు ఉపసంకరించుకున్నారు. టీడీపీ నేతలు సహకరించడం తో జనసేన రెబల్స్ కూడా నామినేషన్స్ ని వెనక్కి తీసుకున్నారు.
అంతే కాకుండా ప్రతిపక్షం పట్ల కూడా టీడీపీ ప్రజాస్వామ్య పద్దతిలోనే ఎదురుకొంటోంది. వైసీపీ పాలనలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీడీపీ , జనసేన పార్టీ అభ్యర్థులను కనీసం నామినేషన్స్ కూడా వెయ్యనివ్వలేదు. ఒకవేళ నామినేషన్స్ వేస్తే ఆ పార్టీల అభ్యర్థులపై దాడులు చేయడం , కిడ్నాపులు చేయడం వంటివి కూడా చేశారు. అయినప్పటికీ కూడా తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అలాంటి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం లేదు. తమతో పాటు సమానంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీ కి కూడా నామినేషన్స్ వేసుకునే అవకాశం కల్పించింది. చంద్రబాబు , లోకేష్ నిబద్దత , రాజ్యాంగం పట్ల గౌరవం ఎలాంటిదో చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేమి ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.