spot_img
Homeఎంటర్టైన్మెంట్Aattam: జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన 'ఆట్టం' లో ఆకట్టుకునే అంశాలు ఇవే..ప్రతీ ఒక్కరు తప్పక...

Aattam: జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘ఆట్టం’ లో ఆకట్టుకునే అంశాలు ఇవే..ప్రతీ ఒక్కరు తప్పక చూడాల్సిన చిత్రం!

Aattam: నేడు ప్రకటించిన జాతీయ అవార్డులలో ఉత్తమ చిత్రం గా మలయాళం ఇండస్ట్రీ కి చెందిన ‘ఆట్టం’ అనే చిత్రం ఎంపికైన సంగతి మన అందరికీ తెలిసిందే. కమర్షియల్ సినిమాలకంటే ప్రయోగాత్మక చిత్రాలకు పెద్ద పీట వేసే మలయాళం ఇండస్ట్రీ కి ప్రతీ ఏడాది ఎదో ఒక సినిమాకి ముఖ్యమైన క్యాటగిరీలలో అవార్డులు వస్తూనే ఉంటాయి. అక్కడ పెద్ద స్టార్ హీరోలు సైతం కథకు తగ్గట్టు ఎలాంటి పాత్రలైనా చేసేస్తారు. అందుకే ఆ ఇండస్ట్రీ కి అత్యధికంగా అవార్డు విన్నింగ్ సినిమాలు ఉంటాయి. ఇంతకు నేడు జాతీయ ఉత్తమ చిత్రం గా ప్రకటించిన ఆట్టం సినిమాలో అసలు ఏముంది..?, అంతలా నేషనల్ అవార్డు జ్యూరీ మెంబెర్స్ కి నచ్చేంతలాగా ఆ సినిమాలో ఏముంది?, అసలు ఆ సినిమా కథ ఏమిటి?, ఏ ఓటీటీ లో చూసేందుకు అందుబాటులో ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే కేరళలో 12 మంది నటులు ఉన్న ఒక నాటక బృందం ఉంటుంది. ఈ నాటక బృందం లో కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే ఉంటుంది. జీవనం సాగించడం కోసం ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ, సమయం దొరికినప్పుడల్లా అందరూ కలిసి నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఈ బృందం లో ప్రదర్శించే నాటికలో వినయ్, అంజలి, హరి అనే ముగ్గురు కీలక పాత్రధారులుగా ఉంటారు. హరి సినిమాల్లో మంచి నటుడు. అతను సినిమా నటుడు కాబట్టి ప్రతీ నాటకంలో అతనే కథానాయకుడిగా ఉంటాడు. అతనికే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వినయ్ కి అసలు నచ్చదు. అయితే ఒక రోజు ఈ బృందం వేసిన నాటం ని చూసి ముగ్దులైన ఒక విదేశీ జంట తమ రిసార్ట్ లో ఈ బృందం కి గ్రాండ్ ట్రీట్ ఇస్తుంది. అందరూ మద్యం పార్టీ లో చిందులేస్తూ మత్తులో ఊగిపోతూ ఉంటారు. బాగా ఆలస్యం అవ్వడంతో అందరూ ఎవరి గదిలోకి వారు వెళ్లి నిద్రపోతారు. అంజలి తన గదిలో ఉన్న కిటికీ పక్కనే పడుకొని నిద్రపోతుంది.

అందరూ నిద్రపోతున్న సమయం లో అంజలి తో ఒకరు కిటికీ లో నుండి చెయ్యి ఆమె పైన వేసి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించిన వ్యక్తి వీళ్ళ నాటక బృందం లో ఉన్న 12 మంది నటులలో ఒకరు. వీరిలో అంజలి తో అలా ఎవరు ప్రవర్తించారు?, అంజలి తనతో అలా ప్రవర్తించిన వ్యక్తి ఎవరో గుర్తు పట్టిందా?, గుర్తు పట్టిన తర్వాత ఏమి జరుగుతుంది అనేదే స్టోరీ.కథ వింటుంటే చాలా ఆసక్తికరంగా ఉంది కదూ..?, స్క్రీన్ ప్లే కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. తెలుగులో ఆడియో అయితే లేదు కానీ, సబ్ టైటిల్స్ మాత్రం తెలుగు వర్షన్ వి ఉన్నాయి. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే ఈ థ్రిల్లింగ్ కథ ని మాత్రం మిస్ అవ్వకండి, వెంటనే చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper