ఎంటర్టైన్మెంట్Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్..'హరి హర వీరమల్లు' చిత్రంలో...

Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్..’హరి హర వీరమల్లు’ చిత్రంలో ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ లో ట్విస్ట్!

Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతూనే, మరోపక్క సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటూ బిజీ గా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ నెల 31 వ తారీఖుతో ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత ఆయన ‘ఓజీ’ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో టీం ఓజీ, టీం హరి హర వీరమల్లు గా విడిపోయి గొడవలు వేసుకుంటున్నారు. ఓజీ కంటే వీరమల్లు బాగుంటుంది,వీరమల్లు కే ఎక్కువ వసూళ్లు వస్తాయని కొంతమంది అభిమానులు, అలాగే ఓజీ ముందు వీరమల్లు దేనికి పనికిరాదు, మా వీకెండ్ వసూళ్లతో కూడా మీ క్లోసింగ్ సరితూగదు అని మరికొందరు కొట్టుకుంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాల నిర్మాతల మధ్య అంతర్యుద్ధం నడుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున థియేటర్స్ లో విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ డేట్ కోసం ఓజీ టీం కూడా పట్టుబడుతోంది. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ కూడా వచ్చే నెలలో పూర్తి అవ్వబోతుంది. షూటింగ్ అయిపోయిన సినిమాలను ఖాళీగా ఎక్కువ కాలం పెట్టుకోలేరు నిర్మాతలు. అలా షూటింగ్ అయిపోవడం, ప్రొమోషన్స్ ప్రారంభించడం, సినిమాని విడుదల చేయడం వంటివి చకచకా జరిగిపోతుంది. ‘హరి హర వీరమల్లు’ కి గ్రాఫిక్స్ వర్క్ తో ఎక్కువ ముడిపడుంది కాబట్టి, ఆ సినిమాని వాయిదా వేయమని, ఆ చిత్రం స్థానంలో ‘ఓజీ’ చిత్రాన్ని విడుదల చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ అనుమతిని కోరబోతున్నారట. మరి పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పుకుంటాడా?, ఆయన ఒప్పుకున్నా ‘హరి హర వీరమల్లు’ నిర్మాత ఏఏం రత్నం ఒప్పుకుంటాడా అనేది ఇప్పుడు ప్రశ్న.

వీళ్లిద్దరి మధ్య సంధి కుదిరించి ఎవరో ఒకరిని వెనక్కి తగ్గేలా చేయడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాధ్యత. ఎందుకంటే ఈ రెండు సినిమాల నిర్మాతలకు వెనక్కి తగ్గడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి విడుదల అవ్వబోతున్న సినిమాలు ఇవి. ఏ సినిమా ముందు విడుదలైతే, ఆ చిత్రానికి ఓపెనింగ్ వసూళ్లు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది. అందుకే అలా పోటీ పడుతున్నారు. మరి చివరికి ఏమి జరగబోతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా ఈ నెల 25 వ తారీఖు నుండి ‘హరి హర వీరమల్లు’ టీం పవన్ కళ్యాణ్ పై ఒక పాటని చిత్రీకరించబోతున్నారు. అలాగే ఆయన స్వయంగా ఆలపించిన సాంగ్ పనులు మొదలయ్యాయి, దీపావళి కానుకగా ఈ పాట విడుదల కానుంది.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
PNB Recruitment 2026

PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి

PNB Recruitment 2026: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్‌ రంగంలో కనీసం ఒక...
Oktelugu Epaper